గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు బుల్లితెరపై ఈటీవీలో మధ్యాహ్నం ప్రసారం అవుతూ ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సీరియల్ అత్తారింటికి దారేది. ఈ సీరియల్ లో నటిస్తున్న కార్తీక్ తన నటనతో, అందంతో ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాడు. అంతేకాదు ఈ మధ్య కాలంలో కార్తీక్ కు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ అవుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు కార్తీక్ రియల్ లైఫ్ స్టోరీ గురించి, ఆయన గురించి మీకు తెలియని మరికొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కార్తీక్ అసలు పేరు ప్రమోద్ రాజ్.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జిల్లాలో మార్చి 18 వ తేదీన జన్మించారు. ఇక కార్తీక్ విద్యాభ్యాసం విషయానికి వస్తే యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఇక కార్తీక్ స్కూల్ చదువుకునే సమయంలో నే డాన్స్ అంటే ఎనలేని అభిమానం.. స్కూల్ డేస్ లో జరిగే ఏ ఫంక్షన్ అయినా సరే ఇట్టే హాజరై తన డాన్స్ తో అందర్నీ ఆకట్టుకునే వాడు. అంతేకాదు నటన అన్నా కూడా ఎనలేని ప్రాణం. ఇక కాలేజీ సమయాలలో కూడా కొన్ని నాటకాలలో కార్తీక్ తన నటనతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశాడు.

ఇక చదువు పూర్తవగానే అందరూ హెచ్ ఆర్ మేనేజ్మెంట్ లో ఉద్యోగం చేయమని ఎంత చెప్పినప్పటికీ , తనకు నటన అంటే ఇష్టం కాబట్టి అందుకే బుల్లితెరపై సీరియల్స్ లో కన్నడ ఇండస్ట్రీ లో నటించడానికి అడుగుపెట్టాడు. అత్తారింటికి దారేది సీరియల్ ద్వారా మొదటిసారి తెలుగుతెరపై అడుగుపెట్టాడు కార్తీక్. ఇక ఈ సీరియల్ తో ప్రేక్షకులను మాయ చేస్తూ మైమరిపిస్తూ  ఎంతోమందిని ఆకట్టుకోవడమే కాకుండా ముఖ్యంగా అమ్మాయిలు హృదయాలను దోచుకుంటున్నాడు కార్తీక్. అంతేకాదు ఈ సీరియల్ లో నటించే నటీనటుల తో కూడా బాగా కలిసిపోయి, అందరితో సంతోషంగా ఉన్నట్లు చాలా ఫ్రెండ్లీ నేచర్ అంటూ మిగతా నటీనటులు కూడా తెలపడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: