అతి తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటీమణులలో అష్టాచమ్మ సీరియల్ చైత్ర కూడా ఒకరు. తన అందంతో నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన చైత్ర అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. చైత్ర పుట్టి పెరిగిందంతా బెంగళూరులో అయినప్పటికీ మొదట కన్నడ సీరియల్స్ లో తన నటన తో బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించింది ఇక తన నటనతో ఆకట్టుకున్న ఈమె బుల్లితెర సీరియల్స్ దర్శకులను కూడా తనవైపు తిప్పుకునేలా చేసుకుంది. ఇక అలా కన్నడ సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైత్ర తెలుగు బుల్లితెర పై కూడా అవకాశాలను సంపాదించుకుంది.


చైత్ర కు ద్విపాత్రాభినయం చేయడం అంటే చాలా ఇష్టమట. అందుకోసమే ఎన్నో ప్రయత్నాలు చేసింది..కానీ చివరకు తన కలను నెరవేర్చుకుంది. తను కోరుకున్నట్టుగానే అక్క చెల్లెలు సీరియల్ లో ద్విపాత్రాభినయం చేసే అవకాశం వచ్చింది. ఈ సీరియల్ లో ఒక పాత్రలో పాజిటివ్ రోల్ చేస్తూ , మరొక పాత్రలో నెగిటివ్ రోల్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నిజానికి బెంగళూరు భామ అయినప్పటికీ చూడడానికి అచ్చు తెలుగు అమ్మాయిలా ప్రేక్షకులను అలరించింది చైత్ర.

ఇక మొదటి సారి అష్టా చమ్మ అనే సీరియల్ ద్వారా బుల్లితెర కు పరిచయమైన చైత్ర ఈ సీరియల్లో నటించేటప్పుడు బెంగళూరు నుంచి ప్రతిసారి హైదరాబాద్ వచ్చే దానిని అని, తనకు భాష రాకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని కూడా తెలిపింది చైత్ర. మొదట అందరూ తనను తెలుగు అమ్మాయి అనుకున్నారు కానీ.. ఇక్కడ వాతావరణానికి బాగా అలవాటు పడినట్లు,  అందరూ చాలా చక్కగా కలిసి పోయారు అని కూడా తెలిపింది. గత తొమ్మిది సంవత్స రాల నుంచి తెలుగు బుల్లితెర పై నటిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందు తోంది చైత్ర.

మరింత సమాచారం తెలుసుకోండి: