తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రసవత్తరంగా కొనసాగుతోంది. నిన్న, మొన్నటి వరకు లెక్కలు వేరే ఇప్పుడు తెలుస్తున్న కౌంటింగ్ వేరే. ఇప్పటి వరకు టాప్ ఫైవ్ లిస్ట్ లో మొదట శ్రీ రామ్, ఆ తరవాత స్థానం లో రవి, సన్ని, మానస్, అనీ మాస్టర్లు ఉండగా నిన్నటి ఎపిసోడ్ తో సన్ని సడన్ గా మొదటి స్థానం లోకి చేరినట్లు తెలుస్తోంది. మరి స్టార్ డం తెచ్చుకోవడానికి ఒక్క నైట్ చాలు అని చాలామంది స్టార్లు నిరూపించారు. ఒక చిన్న అవకాశం చాలు తామేంటో నిరూపించుకోవడానికి అలాంటి అవకాశమే నిన్నటి ఎపిసోడ్ లో సన్ని కి వచ్చింది. మొన్న శుక్రవారం రోజు టాస్క్ సమయంలో ఇంటి సభ్యుల మధ్య గొడవలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అందులో సన్నీనే ఎక్కువ సీరియస్ అయినప్పటికీ అతడిని అలా బరస్ట్ అయ్యేలా  రెచ్చగొట్టింది మాత్రం సిరి, షన్ను లే అన్నది చూసిన వారందరికీ అర్థమయ్యే ఉంటుంది. 

ఆ గొడవలు గురించి శనివారం ఎపిసోడ్ లో మళ్ళీ తవ్వారు నాగ్. తిరిగి అంతా సిరి, శ్రీ రామ్, అనీ మాస్టర్, షన్ను అంతా ఒకటై పోయి కలసి సన్నిని మెయిన్ గా  టార్గెట్ చేశారు. జరిగిన దానిలో సన్ని ఒకటి రెండు మాటలు తూలుండొచ్చు, కానీ అలా అనే వరకు అతడిని రెచ్చగొట్టారు సిరి, షన్ను లు. అలాగే వారు కూడా ఏం తక్కువ కాదు చాలానే మాటలు విసిరారు. సిరి అయితే వాడు, వీడు అంటూ దుర్బాషలాడింది. నిజానికి సన్ని అన్న చిన్న మాటకి అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. అలాగే షన్ను కూడా నాగ్ ముందే సన్నిపై గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడాడు. కానీ అది కానీ, సిరి అరుపులు కానీ, అనీ కాజల్ ని వెక్కిరిస్తూ చేసిన వింత చేస్టలు కానీ కౌంట్ కాలేదు. కానీ సన్ని ఏ చిన్నది చేసినా వారైదుగురు బలంగా మారి సన్ని ని టార్గెట్ చేసేస్తారు. నిజానికి సన్ని ఒక లెవల్ వరకు కూల్ గానే ఉంటాడు. 

మరి అంత రెచ్చ గొడుతూ పోతే ఎవరు మాత్రం సహనంగా ఉంటారు అంటూ చాలామంది జనం సన్నికే సపోర్ట్ చేస్తున్నారు. అసలు  అప్పట్లో కౌశల్ ఎలా అయితే హౌజ్ లో కార్నర్ అవుతూ వచ్చాడో ఇపుడు సన్ని కూడా సేమ్ అలాగే అవుతున్నారని. చివరికి కౌశల్ లాగే బిగ్ బాస్ టైటిల్ పట్టుకెలతాడని అంతా అంటున్నారు. మరి ఎక్కువ మంది ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇక వారే విన్ అవుతారు కదా అన్నది మరో అంశం. మొత్తానికి సన్ని కి మాత్రం మెజారిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: