ఎంతో ఘనంగా ఆరంభమైన బిగ్ బాస్ సీజన్ 5...ఎప్పటి లాగే ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలను విశేషంగా కట్టుకుంటోంది. పది వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 11 వ వారం జరుగుతోంది. ఇక మిగిలింది నాలుగు వారాలు కావడంతో హౌస్ లో సీరియస్ వాతావరణం నెలకొంటోంది. ఎప్పుడు ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలియడం లేదు. అయితే రెండు గ్రూపులుగా విడిపోయి వీరు ఆడుతున్న గేమ్ మాత్రం సూపర్ అని చెప్పాలి. బిగ్ బాస్ అంటే కేవలం గేమ్ మాత్రమే కాదు. అంతకు మించి ఎన్నో విషయాలు ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటే లవ్ రిలేషన్. ప్రతి సీజన్ లో ఎవరో ఒక జంటను దీనికి కమిట్ చేయిస్తూ ఉంటారని గతంలో చాలా వార్తలు వచ్చాయి.

ఇందుకు బలం చేకూరుస్తూ ఇంటి నుండి బయటకు వచ్చిన సభ్యులు ఇది ఒక కమిటెడ్ షో అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే అదే విధంగా ఈ సీజన్ లోనూ ఇద్దరి మధ్య ప్రేమను ఎంతో సీరియస్ గా నడుపుతున్నారు. ఆ జంట షణ్ముఖ్ జస్వంత్ మరియు సిరి హన్మంత్. మొదట్లో వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా చలామణీ అయినా రాను రాను ఆ ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఒకరికోసం ఒకరు ఏడవడం, గేమ్ లో త్యాగాలు  చేసుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు హాగ్ లు, అప్పుడప్పుడు కిస్ లు, ఒకే బెడ్ పై పడుకోవడం లాంటి ఎన్నో పనులతో ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చింది.

అయితే వీరిద్దరికి మాత్రం ఇంకా క్లారిటీ వచ్చినట్లు కనబడడం లేదు. దీనిపై నిన్న ఎపిసోడ్ లో యాంకర్ రవి ఒక క్లారిటీ ఇచ్చాడు. డైరెక్ట్ గా సిరితోనే మీ ఇద్దరి మధ్య ఏమి జరుగుతుందో ఒకసారి ఆలోచించుకో? నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు? ఏమి చేస్తున్నావ్? అంటూ ఆరాతీశాడు. ఏదో బలమైన్ బంధం మిమ్మల్ని పెనవేస్తోంది అన్న రీతిలో సిరితో చెప్పాడు. అయితే సిరికి అర్ధమయినా కానట్టు ఊరుకుంది. మరి వీరి ఈ ప్రేమాయణం ఇంకా ఎన్ని అర్జులో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: