గత నాలుగు సీజన్ లుగా తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో పెద్దగా సెలెబ్రిటీలు లేకపోయినా బిగ్ బాస్ తనదైన టాస్క్ లతో ప్రేక్షకులను రంజింపచేస్తోంది. షో లో ఉన్న కంటెస్టెంట్ ల మధ్యన ఎన్నో భావోద్వేగాలు వివిధ పరిస్థితుల మధ్యం బయటపడుతూ ఉంటాయి. అయినా కానీ అందరూ ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఈ టైటిల్ ను గెలవడం అనేది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంత ముఖ్యమో తెలిసిందే. కానీ బిగ్ బాస్ టైటిల్ గెలవడం అంత ఈజీనా? అంటే కాదనే చెప్పాలి. అందరితోనూ ఒకే విధంగా ఉంటూ ఎటువంటి బేషజాలు చూపకుండా... ఇగోకి వెళ్లకుండా కల్మషం లేకుండా ఉండాలి.

ఈ లక్షణాలు ఉన్న వారినే ప్రేక్షకులు బాగా ఇష్టపడుతారు. టైటిల్ గెలవడానికి అవసరం అయిన మద్దతును ఇస్తారు. అయితే ఇప్పుడు హౌస్ లో ఉన్న వారిలో గెలవడానికి అవకాశం ఉన్నది కేవలం ఇద్దరికే అని చెప్పాలి. వారిలో ముందుగా సన్నీ ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ పేరు వినబడుతోంది. ఇద్దరూ కూడా మొదటి నుండి తాము తాముగా ఉన్నారు. కానీ షణ్ముఖ్ విషయంలో కొన్ని నెగటివ్ పాయింట్లు వినబడుతున్నాయి. ముఖ్యంగా ఇంటిలో మరో కంటెస్టెంట్ అయిన సిరితో షణ్ముఖ్ ప్రవర్తిస్తున్న తీరు పట్ల తీవ్ర వ్యతిరేకత కలుగుతోంది. వీరిద్దరూ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నా పరిస్థితి అలా కనిపించడం లేదు.

ఈ ఒక్క విషయం షణ్ముఖ్ ను టైటిల్ కు దూరం చేయవచ్చు. ఇక సన్నీ గురించి చెప్పాలంటే మొదటి నుండి ఒకే విధంగా ఉంటూ అందరితోనూ కలిసి మెలసి ఉన్న తీరు పట్ల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఇంట్లో ఉన్న మిగిలిన ఎవ్వరూ కూడా సన్నీతో పోటీ పడలేరు. దీనిని బట్టి బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ దక్కేది సన్నీకేనని క్లియర్ గా తెలుస్తోంది. మరి చూద్దాం ఏమి జరగనుందో?


మరింత సమాచారం తెలుసుకోండి: