సీరియల్స్ లో కంటే బిగ్ బాస్ ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రముఖ నటుడు విశ్వ. నిజానికి బిగ్ బాస్ రియాల్టీ షో అనేది ఎంతో మంది జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది.. బిగ్ బాస్ షో అనేది కొన్నిసార్లు కొంతమందికి మంచి చేస్తే , మరికొన్ని సార్లు చెడు కూడా చేస్తుంది.. అంతేకాదు ఎవరికి ఎలాంటి ఇమేజ్ వస్తుందో.. ఎవరు ఎలాంటి పాపులారిటీని పొందుతారో.. కూడా చెప్పడం చాలా కష్టం.. ఇక పోతే మిగతా నాలుగు సీజన్ ల కంటే ప్రస్తుతం ఐదవ సీజన్ కొనసాగుతోంది. ఇందులో చాలామంది కంటెస్టెంట్ లకు చాలా మంచి పేరు వచ్చిందనే చెప్పాలి.. అంతే కాదు ఎన్నో అంచనాలు ఉన్న కంటెస్టెంట్ లు కూడా ముందు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అందులో నటుడు విశ్వ కూడా ఒకరు. అంత త్వరగా ఎలిమినేట్ అవుతారని ఎవరూ అనుకోలేదు.

ఇకపోతే తాజాగా విశ్వా బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు.. ఉన్నట్టుండి సడన్ గా ఇంత లగ్జరీ కారును కొనుగోలు చేయడంతో అందరూ షాక్ అవడం గమనార్హం.. బీఎండబ్ల్యూ అంటే చాలా రేంజ్ లో వున్న కారు.. ఈ రేంజ్ లో ఉన్న కారును కొన్నాడు అంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు బిగ్ బాస్ నుంచి వచ్చిన పారితోషికం తోని కొనుగోలు చేసి ఉంటారు అని అందరూ అనుకుంటున్నారు. నిజానికి మనం కన్న కలలు నెరవేరితే ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము.

విశ్వ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కన్న కారును కొనడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు.. అంతే కాదు నేను అదే ఫీలింగ్ లో ఉన్నాను అంటూ.. మా కుటుంబం లోకి ఒక కొత్త నెంబర్ వచ్చిచేరింది అంటూ.. దీనంతటికీ కారణం ఆ దేవుడు అలాగే బిగ్ బాస్ షో అంటూ విశ్వ బాగా ఎమోషనల్ అయ్యారు. ఇక ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఆనందాన్ని పంచుకోవడం తో పోస్ట్ కాస్తా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: