దీప్తి సునైన ఈ పేరు తెలియని తెలుగు వారుండరు ఏమో, డబ్ స్మాష్ వీడియోల ద్వారా బాగా పాపులర్ అయిన ఈ సొట్టబుగ్గల సుందరి బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా వచ్చి అంతకు మించిన క్రేజ్ ను పెంచుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం కెరియర్ పరంగా అటు యూట్యూబ్ లోనూ, మరో వైపు స్పెషల్ ప్రోగ్రామ్స్ తోనూ  ఫుల్ జోష్ పై ఉంది.  ఇక ఈమె వ్యక్తిగత జీవితం విషయానికొస్తే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.  డబ్ స్మాష్ చేస్తున్న సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇద్దరూ కలసి చాలా డాన్స్ వీడియోలు చేశారు. అలా వీరి మధ్య ప్రేమ మరింత బలపడింది.

వీరికి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమకు గుర్తుగా ఒకరి చేతులపై మరొకరు వారి పేర్లను టాటూలు కూడా వేసుకున్నారు.. ఇక దీప్తి సునైన బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళాక నటుడు తనీష్ తో ఎంత క్లోజ్ గా ఉన్నదో తెలిసిందే. వీరి రొమ్యాన్స్ పై పలు వార్తలు భగ్గుమన్నాయి.  దీంతో సునైన హౌజ్ లో తనీష్ కి మరింత దగ్గరవడం చూసి బయట షన్ను బాగా హర్ట్ అయ్యాడని ...దీప్తితో తన ప్రేమ బందాన్ని కూడా వదులుకున్నాడు అని వార్తలు వెల్లువెత్తాయి. దీప్తి హౌజ్ నుండి బయటకు వచ్చాక కూడా షన్నును కలవకపోవడంతో ఈ వార్తలు మరింత జోరును పెంచాయి.  ఆ తర్వాత కట్ చేస్తే హీరో తనీష్ దీప్తి తనకి చెల్లెలు లాంటిది అని క్లారిటీ ఇచ్చారు. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఆ స్టేట్మెంట్ తర్వాత దీప్తి సునైన, షన్ను ల జంట మళ్ళీ చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుందని అనుకున్నారు. కానీ కొన్నాళ్లుగా వీరు బయట పెద్దగా కనిపించలేదు.  ఆ తరవాత ఒకసారి మీడియాతో మాట్లాడిన షన్ను...తన చేతిని దీప్తి గుర్తుగా ఉన్న టాటు చూపించి ఇది పోయేంత వరకు నా ప్రేమ  పోదని స్పష్టం చేశారు. వీరి ప్రేమ గురించి ఇంట్లో కూడా తెలుసు వారు ఒప్పుకున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా బాగా సెటిల్ అయ్యాక వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని ఈ జంట నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: