ఈ సారి హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యేది తానే అంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ లీక్స్ లో ఈ విషయంపై క్లారిటీ కూడా వచ్చేసింది అంటున్నారు మరికొందరు. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరంటే ప్రియాంక సింగ్. ఈ సారి నామినేషన్ లో ఒక్క సన్ని మరియు షన్ను తప్ప మిగిలిన వారందరూ ఉన్నారు. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో వీరిద్దరూ మినహాయించి మిగిలిన వారందరూ నామినేట్ అయ్యారు. షణ్ముఖ్ జస్వంత్ కాజల్‌ను, ప్రియాంకను నామినేట్ చేయగా..ప్రియాంక సింగ్ కాజల్ ని సిరిని నామినేట్ చేసింది. శ్రీ రామ్ కాజల్, మానస్ లను నామినేట్ చేశాడు. సిరి ఏమో ప్రియాంక మరియు కాజల్ ను నామినేట్ చేసింది.

సన్ని, మానస్ లు సిరి మరియు శ్రీ రామ్ లను నామినేట్ చేశారు. ఇలా సన్ని, షన్ను తప్ప మిగిలిన వారంతా నామినేషన్ జోన్ లో పడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఇంటి నుండి బయటకు వెళ్ళేది ప్రియాంక సింగ్ అని తెలుస్తోంది. సన్ని, షన్ను, శ్రీ రామ్ ల తర్వాత మానస్ కి కూడా బయట బాగానే ఫాలోయింగ్ ఉంది. అయితే అతడి ఆటను డిస్టర్బ్ చేస్తూ అతడిని ముందుకు వెళ్లనివ్వడం లేదని ఆయన ఫ్యాన్స్ ప్రియాంకపై కారాలు మిరియాలు నూరుతున్నారట. ఓట్లు తక్కువ పడటానికి ఇదొక కారణమని తెలుస్తోంది. ఇక మిగిలిన ఇంటి సభ్యులతో పోలిస్తే ప్రియాంకకు గేమ్ పై ఫోకస్ తక్కువని ఇంకొందరి అభిప్రాయం.

ఇలా ఆమెకు ఓట్ల గ్రాఫ్ బాగా తగ్గుతోందని సమాచారం. ఈ లెక్కన హౌజ్ నుండి బయటకు వెళ్ళబోయేది ప్రియాంకనే అంటూ తెలుస్తున్న సమాచారం. మరి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారో పూర్తి క్లారిటీ రావాలంటే శుక్రవారం వరకు వెయిట్ చేయాల్సిందే. మరో వైపు హౌజ్ లో టాప్ ఫైవ్ లోకి నేరుగా వెళ్లేందుకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్. అయితే టాస్క్ లు కొంచం కష్టం లెండి. అయిన ఇచ్చే టాస్క్ ల్లో ఎవరు విజేతగా నిలిస్తే వారు టాప్ ఫైవ్ లోకి నేరుగా వెళ్లొచ్చు. మరి అది ఎవరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: