ఇప్పుడు ఎక్కువగా సెలబ్రిటీలు సైతం.. కాస్త డబ్బులు వెనక్కి వేసుకునేందుకు మద్యపానం వంటి వాటిపైన ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బాగా పాపులర్ గా ఉండే ఇటువంటి వారే ఇలాంటి పనులు చేయడం గమనార్హం. తాజాగా ఇప్పుడు యాంకర్ రష్మి కూడా ఒక ఒక బ్రాండ్ పైన యాడ్స్ చేసింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పూజా హెగ్డే, రెజీనా, లక్ష్మీ రాయ్ వంటి వారు కొన్ని బ్రాండ్ల ప్రమోషన్లలో పాల్గొనడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా వీరితో పాటు యాంకర్ రష్మి కూడా ఈ లిస్ట్ లోకి చేరింది అని చెప్పవచ్చు.ఇక రష్మీ గ్రూపులోకి చలాకి చంటి, ముక్కు అవినాష్ పాల్గొనడం జరిగింది. వీరందరూ కలసి ఒక ప్రముఖ బ్రాండ్ కు ప్రమోట్ చేయడం జరిగింది. ఆ బ్రాండ్ ఏమిటంటే ఎంసి నెంబర్ వన్. అనే బ్రాండ్ ని వీరు ఎలా పాపులర్ చేశారో ఒక వీడియో ద్వారా తెలపడం జరిగింది. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ముక్కున వేలు వేసుకున్నారు. రష్మి ఇలాంటి పని కూడా చేస్తోందా అంటూ కూడా  కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

వీరందరూ కలిసి వీడియో కాల్ లో మాట్లాడుతున్నప్పుడు..ఇప్పుడు చంటిని ఏమున్నది మీ చేతిలో అని అడగగా.. చంటి మాట్లాడుతూ కమ్మటి విస్కీ.. కమ్మటి వాసన అదే నెంబర్ వన్ బ్రాండ్ అంటూ ప్రమోట్ చేయడం జరిగింది. ఇక వీరితో పాటు ముక్కు అవినాష్ కూడా జాయిన్ అవడం గమనార్హం. ఇక చంటి అవినాష్ తో మాట్లాడుతూ.. ఏంరా అవినాష్ ఇప్పుడు బాగా పాపులర్ అయ్యావు. పార్టీ ఎప్పుడు ఇస్తావు అని అడగగా.. పార్టీ అంటే ఎలా ఉండాలో తెలుసు కదా ఫుల్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండాలని తెలిపింది.

అవినాష్ మాత్రం నాకు పని ఉంది అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. చివరిగా మన స్నేహితులు అందరిని పిలవండి బాగా పార్టీ చేసుకుందాం అంటూ అవినాష్ తెలియజేశారు. ఫ్రెండ్స్ అంటే మనతోపాటు అందర్నీ పిలవండి అంటూ రష్మీ తెలియజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: