సీరియల్స్ అనేవి బుల్లితెర మహా రాజులనే చెప్పాలి. ఎందుకంటే బుల్లితెర అంటేనే సీరియల్ ....సీరియల్ అంటే బుల్లి తెర. ప్రోగ్రామ్ లు, షోలు వస్తున్నప్పటికీ సీరియల్స్ మాత్రం మేము లోకల్ అంటూ బుల్లి తెరపై తమ సత్తా చాటుతుంటాయి. ముఖ్యంగా గృహిణులకు చక్కటి ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు. అయితే ఈ వారం బుల్లితెరపై స్టార్ మా లో అత్యదికంగా రేటింగ్ పొందిన సీరియల్స్ 'దేవత' మరియు 'గుప్పెడంత మనసు' అని సమాచారం. అయితే దేవత సీరియల్ లో ఇటీవలే సత్య పాత్రలో నటిస్తున్న వైష్ణవికి బదులుగా మరో కొత్త హీరోయిన్ వచ్చేసింది. అయితే అప్పటి నుండి కథను ఏమలుపు తిప్పుతారో అని ఈ సీరియల్ ప్రియతమ ప్రేక్షకులు తెగ టెన్షన్ పడుతున్నారు.

కొందరైతే ఈ కొత్త హీరోయిన్ అంతగా మాకు కనెక్ట్ అవ్వడం లేదండి పాత సత్యనే తీసుకురండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆదిత్య, రుక్మిణి లను మాత్రం కలపడం మర్చిపోకండి ప్లీజ్...లేకపోతే ఈ సీరియల్ కి ఉన్న పేరే పోతుంది. కథని ఎటు తిప్పిన ఆదిత్య, రుక్మిణి ఒకటవ్వడమే న్యాయం కాబట్టి తొందరగా ఆ స్క్రిప్ట్ రెడీ చేసుకోండి డైరెక్టర్ బాస్. కావాలంటే ఒకటి చేశాక కావలసినన్ని ట్విస్ట్ లు పెట్టుకోండి. కానీ ఇక వీరి మధ్య దూరం తగ్గించండి అంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు ఈ సీరియల్ అభిమానులు.

ఇక 'గుప్పెడంత మనసు' సీరియల్ లో వసుధార, రిషి ల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంటున్నాయి. ఈ సీరియల్ కథను నడిపిస్తున్న విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే వీరిద్దరికీ ఇద్దరి మీద ప్రేమ ఉన్నా చెప్పలేక మనసులతో దాగుడుమూతలు ఆడుకుంటున్నారు. ఈ ఎడబాటు ఎప్పుడు తీసి వారిద్దరినీ ఒకటి చేస్తారో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ వారం ఈ రెండు సీరియల్స్ మాత్రమే బాగా ఆకట్టుకున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: