బుల్లితెరపై ఓంకార్ యాంకర్ గా పలు షో లలో రాణించిన సంగతి మనకు తెలిసిందే. బుల్లి తెరపై ఆట, సిక్స్త్ సెన్స్, మాయాద్వీపం, ఇస్మార్ట్ జోడి.. వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో షోలను చేసి టిఆర్పి రేటింగ్ మొదటి స్థానంలో ఉంచుతూ ఉంటాడు ఓంకార్. ఇక అంతే కాకుండా కొన్ని షోలకు పెట్టుబడులు కూడా పెట్టినట్లు సమాచారం. ఇక దాంతో..OAK ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్ ను కూడా స్థాపించి వాటిపై ఎన్నో షో లను చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే తాజాగా బిగ్ బాస్ ను ఓటిటి లో విడుదల చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

తాజాగా బిగ్ బాస్ -5  పూర్తి అయిన వెంటనే.. ఓటీటీ లోనే విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా నాగార్జున తెలియజేశాడు. మరో రెండు మాసాలలో బిగ్ బాస్ సరికొత్త సీజన్ ప్రారంభించబోతున్నాము.. 24 గంటలు ఈ షో ప్రసారం అవుతూ ఉంటుందని తెలియజేశాడు. అదికూడా హాట్ స్టార్ లోనే అని తెలియజేయడం జరిగింది.రాబోయే బిగ్ బాస్-6 కూడా తనే హోస్టుగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు నాగార్జున. అయితే ఈ ఓటిటి లో విడుదలయ్యే షో కి ఎవరు హోస్ట్ అన్నది మాత్రం తెలియడం లేదు. అయితే హిందీ భాషలో మరి ఈ  షో కి హోస్ట్  చేంజ్ చేస్తారా లేదా అనే  విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

ఇక బిగ్ బాస్ తెలుగులో 24 గంటలు ప్రసారం అయితే ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ షో బాధ్యత అంతా ఓంకార్ కే ఓప్ప చెప్పినట్లు తెలుస్తోంది.అసలు  విషయానికి వస్తే ఇక ఈయనకు అప్పగిస్తే కచ్చితంగా హోస్టు గా ఈయనే ఉంటారని తెలుస్తోంది. ఓంకార్ తన మాటలతో ప్రేక్షకులను బాగా మైమరిపించే లా చేస్తారని భావిస్తున్నారు. బిగ్ బాస్ -6 కు సంబంధించి కంటెస్టెంట్ లిస్ట్ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: