జబర్దస్త్ రావడంతో ప్రతి ఒక్కరి ఈ షో ను ఇంట్లో అందరూ నవ్వులు చిందిస్తూ ఉంటారు. ఈ వేదికపై కమెడియన్లు చేసే కామెడీ ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది. అందుచేతనే ఎన్నో సంవత్సరాలు తరబడి బాగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఇక అంతే కాకుండా జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ షో లు కూడా పుట్టుకొచ్చాయి. ఇక ఏదైనా పండుగ వస్తోందంటే చాలు అందుకోసం మల్లెమాల సంస్థ ఏదో ఒకటి స్పెషల్ ప్రోగ్రామ్ ను సిద్ధం చేస్తూ ఉంటుంది.ఇక ఈ ప్రోగ్రాముల్లో కూడా తెగ నవ్విస్తూ ఉంటారు కమెడియన్లు. అలా నవ్వించే వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ఈయన నోట పంచ్ పేలనిదే అసలు మాట బయటికి రాదు. అలాంటి కమెడియన్ కోసం ఇద్దరు హీరోయిన్లు పోట్లాడు కోవడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.

ఇక ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా సంక్రాంతికి సందడి చేయడానికి సిద్ధమయ్యారు జబర్దస్త్  కమెడియన్స్. ఈసారి కూడా వెరైటీ గెటప్ లతో పండుగ రోజున హంగామా చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేశారు ఆ షో నిర్వాహకులు. తాజాగా అందుకు సంబంధించిన ఒక ప్రోమో కూడా బయటకి విడుదలైంది. ఇక అందుకు తగ్గట్టుగా"అమ్మమ్మగారి ఊరు" అనే పేరుతో ఈ షో ను ఈ నెల 15వ తేదీన ప్రసారం చేయబోతున్నారు.


అందులో భాగంగానే హైపర్ ఆది కోసం అలనాటి హీరోయిన్లు రోజా, ఆమని ఇద్దరు పోట్లాడుకోవడం ఈ ప్రోమో కి హైలెట్ గా నిలిచారు. ఇక అంతే కాకుండా వీరు అప్పట్లో నటించిన కొన్ని సినిమాలకు సంబంధించి కొన్ని వీడియోస్ ను కూడా చేయడం జరిగింది. ఇక అలాంటి వీడియోలలో అప్పట్లో వచ్చిన శుభలగ్నం సినిమాలో కొన్ని సన్నివేశాలను రీ క్రియేట్ చేసి జగపతి బాబు క్యారెక్టర్ లో ఆది, ఆ తర్వాత హీరోయిన్ లు ఆమని, రోజా లు చాలా చక్కగా చేశారు.. అయితే ఇందులో ఆమనీ దగ్గర వాళ్ళ ఆయన హైపర్ ఆది ని రోజా కొట్టేస్తుంది.. దీంతో మనోడు బాగా రెచ్చిపోయి రోజాపై ప్రేమ చూపించడంతో ..ఆమని నా మొగుడు నాకు కావాలి అంటూ పట్టు పడుతుంది . అప్పుడు రోజా కూడా అదే మాట అనడం తో హైపర్ ఆది నేను జగపతి బాబు ని కాదు ఒకరినే కోరుకోవడానికి నేను ఆది నీ ఇద్దరినీ మేనేజ్ చేస్తాను అని అనడంతో అందరూ షాక్ అవ్వడంతో పాటు కడుపుబ్బ నవ్వుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: