యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎన్నో ట్రోలింగ్ ను ఎదుర్కుంటూ వస్తోంది. ఆమె ఏ విధంగా పోస్ట్ చేసిన.. షేర్ చేసిన, కామెంట్ చేసిన అవి ఎప్పుడు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంటాయి.ఇక వాటిపై ఎప్పుడూ రియాక్ట్ అవుతూనే ఉంటుంది అనసూయ. ఆ మధ్య గత కొద్ది రోజుల కిందట నటుడు కోట శ్రీనివాసరావు చేసిన కొన్ని కామెంట్ల వల్ల కూడా ఆమె కోట శ్రీనివాసరావు పై కూడా విమర్శలు చేయడం జరిగింది. అనసూయ ఒకేసారి అంత పెద్ద నటుడునే వదిలి పెట్టలేదు అంటే.. ఇక సాధారణ నెటిజన్లను మాత్రం వదిలి పెడుతుందా..

కొద్ది రోజుల క్రితం ఆలీతో సరదాగా షో లో పాల్గొన్న అనసూయ.. ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. తనపై నెగిటివ్ కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరి లిస్టు తనదగ్గర ఉన్నదని.. త్వరలోనే వారందరికీ సరైన సమాధానం చెబుతానని ట్రోలర్ల పై మండిపడింది. కెరియర్ మొదట్లో ఎన్నో ట్రోలింగ్ ల వల్ల తన కుటుంబంలో ఎన్నో కష్టాలను చూశానని.. చాలా డిప్రెషన్లోకి కూడా వెళ్లిపోయానని అనసూయ తెలియజేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో అనసూయ కూడా తన అభిమానులతో చిట్ చాట్ చేసిందట. అయితే ఒక నెటిజన్ చేసిన ట్రోలింగ్ వల్ల మరొకసారి తన ఫ్యామిలీ బాధ పడిందని తెలియజేసింది.

ఒక నెటిజన్.. మీరు అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారని ప్రశ్న అడగగా.. దానికి అదిరిపోయే రీతిలో సమాధానాన్ని తెలియజేసింది. ట్రోలింగ్ చేసే వారిని ఎక్కువగా పట్టించుకోనని.. తన కెరియర్ మొదట్లో కేవలం నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాయని చెప్పుకొచ్చింది. కానీ మేమంతా చాలా అలా ఈ విషయాలలో బలంగా మారిపోయానని తెలియజేసింది. కేవలం నేను కర్మ సిద్ధాంతాన్ని మాత్రమే నమ్ముతానని.. అది ఒక్కటే అందరికీ న్యాయం చేస్తుందని తెలిపింది అనసూయ. ఇక అంతే కాకుండా ఎవరైనా రోడ్డుమీద ఉమ్మేస్తే.. తిరిగి మన మీద ఇంకొకరు ఉమ్మేస్తారని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: