అలీ రెజా.. బిగ్ బాస్ సీజన్-3 లో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా అందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచారు. మొదట మోడల్ గా పరిచయం అయి ఆ తర్వాత సినిమాలలోనూ, పలు సీరియల్ లోని నటించారు అలీ రెజా. అయితే బిగ్ బాస్ తో అందరికీ బాగా దగ్గరయ్యాడు. ఆ సీజన్లో ఏడో వారం వరకు హౌస్ లోనే ఉండి అందరికీ గట్టి పోటీ ఇచ్చారు. కానీ ఏడో వారం అనూహ్యంగా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అయితే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కూడా 5వ స్థానంలో సరిపెట్టుకున్నాడు.

ఇక అందులో శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ వంటి వారి కంటే తక్కువ కోట్ల రావడంతో 5 వ స్థానంలో నిలిచారు ఆలీ రేజా. ఇక అలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. నాగార్జునతో కలిసి వైల్డ్ డాగ్ సినిమాలో నటించారు. ఈ చిత్రం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత..aAhie అనే సినిమాలో హీరోగా నటించి సందడి చేశారు. కానీ ఆ చిత్రం ఇటు వచ్చి ఎటుపోయిందో ఎవరికీ తెలియదు.. కానీ అటు సీరియల్స్లో కూడా గత రెండు సంవత్సరాలుగా కనిపించలేదు.

అయితే అలీ రెజా తెరపై కనిపించకుండా పోవడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే.. తనని ప్రొడ్యూసర్ కౌన్సిల్ బ్యాన్ చేసినట్లుగా తెలియజేశాడు. తాజా ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షో కి రావడం జరిగింది. ఈ షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్ అమిత్ తివారి తో గెస్ట్ గా వచ్చారు ఆలీ అలా ఈ విషయాన్ని బయటకి తెలియజేశారు. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు చిన్న మిస్టేక్ చేశానని.. తనకి ఫోన్ చేసిన వారు వెంటనే ప్రొడ్యూసర్ కౌన్సిలర్ ని కలవాలనితెలిపారట. అయితే అలా వెళ్ళడం కాస్త లేట్ అవడంతో అతన్ని బ్యాన్ చేసిన విషయాన్ని తెలిపారట.. అయితే అలా ఎందుకు చేశారు అనే విషయం తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: