బుల్లితెరపై ప్రసారమయ్యే ఎటువంటి బిగ్ బాస్ షో ద్వారా శివ జ్యోతి ఎంతో పాపులర్ అయింది. న్యూస్ ప్రజెంట్ గా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతోమందిని బాగా ఆకట్టుకుంది ఈమె. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు.. ఒకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో పాల్గొంటూ.. మరొకవైపు కొన్ని న్యూస్ ఛానల్ లో బిజీగా ఉంటూ ఉంటోంది. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లక ముందు కేవలం ఇమే తెలంగాణ భాష తో సావిత్రి అక్క గా బాగా గుర్తింపు పొందింది.


ఇక బిగ్ బాస్ సీజన్ త్రీ లో పాల్గొని.. టాప్-6  కంటెస్టెంట్ గా నిలబడింది ఈమె. శివ జ్యోతి తన కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మాత్రం సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గానే ఉంటుంది. ఇక తనకు సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ఈమె పై ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రావడం జరిగింది. ఈ విషయంపై శివ జ్యోతి స్పందించడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఒక వీడియోను కూడా షేర్ చేసింది శివ జ్యోతి.


శివ జ్యోతి మాట్లాడుతూ తన గురించి తనకు తెలియకుండానే పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఒక ఈవెంట్ కి వెళ్తే మామిడికాయతో ఫోటో పెట్టాను అంతే అప్పటి నుంచి సోషల్ మీడియాలో తన ప్రెగ్నెంట్ అంటూ కొన్ని ఫేక్ న్యూస్ రావడం అవి వైరల్ అవ్వడం జరిగాయని తెలియజేసింది. వారి యొక్క వ్యూస్  కోసం ఇలాంటివి చేస్తున్నారని తెలియజేసింది. ఇలాంటివి చేయడం వల్ల తన పర్సనల్ లైఫ్లో చాలా ఎఫెక్టివ్ చూపిస్తోందని తెలియజేసింది. వారికి వివాహమై ఎన్నో సంవత్సరాలు అవుతోంది.. ఇక తమ పిల్లల కోసం తన ఫ్యామిలీ కూడా ఎంత ఆతృతగా ఎదురు చూస్తోంది అందుకోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాం అని ఎంతో ఎమోషనల్గా తెలియజేసింది. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే నేనే చెబుతాను అని తెలిపింది శివ జ్యోతి.

మరింత సమాచారం తెలుసుకోండి: