జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమై ఇప్పటికి పది సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ పది సంవత్సరాలు జబర్దస్త్ కార్యక్రమం లో పెను మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. మొదటి ఎపిసోడ్ లో జడ్జీలుగా నాగబాబు, రోజా వ్యవహరించారు. నాగబాబు దాదాపుగా మానేసి చాలా సంవత్సరాలు అవుతోంది. అయితే ఇక రోజు కూడా తాజాగా మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ ను విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంతో ఆమె జబర్దస్త్ కార్యక్రమం లో కి వస్తుందా రాదా అనే విషయం తెలియదు. ఇక యాంకర్లుగా అనసూయ రష్మీ మాత్రం అలాగే ఉన్నారు.


ఇక జబర్దస్త్ మొదలు పెట్టినప్పటి నుంచి అనసూయ తో పాటుగా రాకెట్ రాఘవ కూడా ఉన్నారు. అనసూయ మధ్యలో వెళ్లిపోయి మళ్లీ తిరిగి వచ్చింది. కానీ రాకెట్ రాఘవ మాత్రం తన మొదటి నుంచి అలాగే కంటిన్యూ అవుతూనే ఉన్నారు. మరి టీమ్ లీడర్ కు దక్కని అరుదైన సీనియారిటీ గౌరవాన్ని దక్కించుకున్నాడు రాకెట్ రాఘవ. ఇక మల్లెమాల వారితో ఆయనకు ఎలాంటి విషయాలలో కూడా విభేదాలు ఉండవని.. ఆయన ఇలాంటి విషయాలను కూడా చాలా నార్మల్గానే తీసుకొని ముందుకు వెళుతూ ఉంటాయని అందుచేతనే ఎన్ని సంవత్సరాల పాటు జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.


అయితే మల్లెమాల వారు మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో చాలా పిసినారులు గా వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే అసలు రాకెట్ రాఘవ కి మల్లెమాల వారు ఎంతటి పారితోషికం ఇస్తారు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అయితే బుల్లితెర వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాకెట్ రాఘవ కు ప్రతి ఎపిసోడ్ కు.. రూ.1.25 లక్షలు అందుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఖర్చులన్నీ పోవు లక్ష రూపాయల వరకు మిగిలి ఉన్నట్లు సమాచారం. అయితే తన టీమ్ లో పనిచేసే వారికి కూడా కొంత పారితోషకం ఇస్తున్నాడట. మల్లెమాల వారు కూడా ఇందులో పాల్గొన్న కమెడియన్స్ కు కూడా రెమ్యునరేషన్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: