జబర్దస్త్ షో ఎంత పెద్ద హిట్ అయ్యింది అన్నది ప్రత్యేకంగా వేరే చెప్పాలా. ఈ షో  టెలివిజన్ లో మొదలయి ఇప్పటికీ 12 ఏళ్లు గడుస్తోంది. ఇప్పటికీ అంతే సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ షో ఎంత పాపులర్ అయ్యిందో...ఈ షో ద్వారా ఆర్టిస్టులు కూడా అంతే పాపులర్ అయ్యారు. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది కళాకారులకు అందని గుర్తింపు ఈ షో కి రావడంతో వచ్చిందనే చెప్పాలి. రేష్మి, అనసూయ, సుడిగాలి సుదీర్, శ్రీను వంటి వారు ఎప్పటి నుండో ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నప్పటికీ వారికి తగిన అవకాశం కానీ , గుర్తింపు కానీ అందలేదు..అలాంటిది ఈ షో తో వచ్చిన పాపులారిటీ వలన వారి జీవితాలే మారిపోయాయి.

హైపర్ ఆది, రాకెట్ రాఘవ వంటి వారికి ఎంతో లైఫ్ ను ఇచ్చింది ఈ కామెడీ షో. అయితే ఈ షో ఇంత పెద్ద హిట్ అవ్వడంలో ఈ షోకి జడ్జ్ లుగా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు, నటి కం రాజకీయ వేత్త అయిన రోజా గార్ల పాత్ర కీలకం అనే చెప్పాలి. వీరి నవ్వులకు ప్రేక్షకులు దాసోహం అయిపోయారు. కొన్నిసార్లు కనపడని పంచ్ లకు కూడా వీరు నవ్వారు అన్న ఒక్క కారణంతో పడి పడి నవ్వే ప్రేక్షకులు ఉన్నారు అనడం అతిశయోక్తి కాదు. ఇది పిచ్చి కాదు అభిమానులా పిచ్చి ప్రేమ.. వీరిద్దరి కాంబినేషన్ కూడా బలే సెట్ అయ్యింది. అలాంటిది మొదట నాగబాబు గారు ఈ షో నుండి వైదొలగడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తరవాత చాలా కాలం వరకు కూడా ఈ షో రేటింగ్స్ చాలా తగ్గిపోయాయి అన్న వార్తలు కూడా చాలా వినిపించాయి.

అయితే రోజా గారు ఉండటంతో ఏదో సర్దుకుపోయి ఆర్టిస్టుల పంచ్ లను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆడియన్స్. అలాంటిది రోజా గారు ఎమ్మెల్యే అయ్యాక ప్రజా సేవకి పూర్తి సమయం కేటాయించాలి అని చెబుతూ టెలివిజన్ కు బై బై చెప్పేశారు. అయితే జబర్దస్త్ లో ఒక్కసారిగా రోజా గారి నవ్వులు వినిపించకపోవడంతో బాగా ఢీలా పడిపోయారు జబర్దస్త్ ప్రేమికులు. ఇంద్రజ గారు అంటే ఇష్టం ఉన్నప్పటికీ  రోజా  గారి నవ్వులకు అడిక్ట్ అయిపోయిన జనాలు ఆ ప్లేస్ లో మరెవ్వరిని ఊహించుకొలేక పోతున్నారు. ఇక ఈమె జబర్దస్త్ విడిచి ఇన్ని రోజులు అవుతున్న ఇప్పటికీ సోషల్ మీడియా వేదికపై తిరిగి ఒక్క జబర్దస్త్ షోకి మాత్రం రమ్మని కోరుకుంటున్నారు. కనీసం వారానికి ఒకసారి ఎక్స్ట్రా జబర్దస్త్ లో అయినా కనిపించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి రోజక్క ఏమో పాలిటిక్స్ లో ఫుల్ బిజీ అయిపోయిన నేపథ్యంలో అభిమానులు ఆశ తీర్చాలని ఉన్నా... కుదరని పరిస్థితులు మరి ఏమైనా ఆల్టర్నేటివ్ ఆలోచించి అప్పుడప్పుడైనా గెస్ట్ గా కనిపిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: