యాంకర్ రష్మి కి మూగజీవాలు అంటే ఎంత ప్రేమ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కుక్కలంటే మరింత మక్కువ చూపిస్తు ఉంటుంది. తన ఇంట్లో కూడా కొన్ని పెట్స్ పెంచుకుంటూ ఉంటుంది రష్మీ. రోడ్డు మీద కూడా బలహీనంగా దీన స్థితిలో ఉన్న వాటిని చూసి జాలి పడుతూ ఉంటుంది. వాటిని ఇంటికి తెచ్చుకొని మరి వైద్యం చేయించి పెంచుకుంటూ ఉంటుంది రష్మీ. ఇక అప్పుడప్పుడు రష్మి కుక్కలకు హాని కలిగించే వారి పైన పిచ్చి పనులు చేసే వాళ్ళ మీద కూడా రష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది.


మూగజీవాలను హింసించే వారిని రష్మీ ఎప్పుడు ఉపేక్షించదు. తనకు వీలైనంత లో వారిని శిక్షపడేలా చేస్తూ ఉంటుంది. అందరికీ రీచ్ అయ్యేలా ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఉంటుంది. ఆ బాధాకరమైన దృశ్యాలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా కొంత మందిని కలిసి ఓ కుక్క ను దారుణంగా కొట్టి కొట్టి చంపడం జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వీడియో ఎంతో క్రూరంగా ఉన్నది. దీనిపై రష్మి స్పందించడం కూడా జరిగింది.
ఇక రష్మి అసలు వీళ్లు మనుషులేనా.. వారికి జాలి దయ అనేది ఉండవా.. వాళ్లు మనుషులకు పుట్టారా..? అంటూ యాంకర్ రష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. వారికి శిక్ష పడేవరకు ఈ వీడియో ని షేర్ చేస్తూ ఉండండి అని తన అభిమానులను కోరుతోంది. అయితే వారిని పోలీసులు అరెస్టు చేశారట అయినా కూడా రష్మీ కోపం మాత్రం చల్లార లేదని తెలిపింది. వారికి శిక్ష పడిన కూడా దాని ప్రాణాలు మాత్రం తిరిగి రావు కదా అని.. వాళ్లని పెంచిన తల్లిదండ్రులను తిట్టి పోస్తోంది. ప్రస్తుతం యాంకర్ రష్మి షేర్ చేసిన ఈ పోస్టు చాలా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: