తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రజలకు జబర్దస్త్ లో ఉండే గెటప్ శీను గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన కోసమే ఎంతోమంది జబర్దస్త్ ప్రోగ్రాం లు చూస్తూ ఉంటారు. బుల్లి తెరపై నవ్వులు పండిస్తూ ఎంతోకాలంగా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ఈ కమెడియన్. గెటప్ శీను గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అని చెప్పవచ్చు. బుల్లితెర కమలహాసన్ అంటూ ఆయన అభిమానులు తనని పిలుచుకుంటూ ఉంటారు. బుల్లితెరపై నవ్వులు పండిస్తూ జబర్దస్త్ లో అట్రాక్షన్గా నిలిచారు ఈయన.

అలాంటి శ్రీను జబర్దస్త్ షో నుండి బయటికి వెళ్లిపోవడం ప్రస్తుతం శ్రీను ఎక్కడ ఉన్నాడు అనే విషయంపై ఆయన అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఇంతవరకు ఈయన గురించి ఏ విషయం బయటికి రాలేదు. మొన్నటి వరకు సినిమాలలో బిజీగా ఉండడం వల్ల జబర్దస్త్ లో కనిపించలేదని వార్తలు వెలుబడ్డాయి. ఇక యధావిధి గానే రెండు మూడు వారాల తరువాత ఈ షోలో కనిపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటికీ నాలుగు వారాలు కావస్తున్న ఈ షోలో శ్రీను కనిపించకపోవడంతో ప్రేక్షకులు మరింత ఫోకస్ పెట్టారు ఈయనపై.


తాజాగా గెటప్ శ్రీను బుల్లితెరపై కనిపించడు అనే క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక మరి వేరే ఛానల్ లో కూడా కనిపించలేదు. గెటప్ శ్రీను ఎక్కడ ఉన్నా కూడా ఆయన అభిమానులు తన గురించి అనేక ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం గెటప్ శీను కొన్ని సినిమాలలో బిజీగా ఉన్నారని అందుచేతనే ఆయన జబర్దస్త్ లో నటించడానికి రాలేదని కొందరు వార్తలు తెలియజేస్తున్నారు. మరికొందరు మాత్రం గెటప్ శీను జబర్దస్త్ కారణంగా చాలా నష్టపోయారని అసలు ఎటూ కాకుండా పోయాడని వార్తలను కూడా వినిపించారు. అయితే గెటప్ శ్రీను ఈ విషయంపై స్పందిస్తారో చూడాలి మరి. ఏది ఏమైనా ఎక్కువగా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షో నుంచి బయటికి వెళ్లి పోతున్న వారు చాలా మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: