ఎక్స్ ప్రెస్ హరి, అషూ రెడ్డి ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట్లో అన్నయ్య అంటూ హారిని చాలా ఆటపట్టించేది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మెల్లమెల్లగా ఫ్రెండ్ అనడం కూడా మొదలు పెట్టింది. ఇక ఆమె కోసం హరి కూడా టాటూలు వేయించుకోవడం తన పేరుని గుండెల మీద పచ్చబొట్టు పొడిగించుకోవడం వంటివి పని చేశాడు. దీంతో స్టేజ్ పైన అషూ రెడ్డి ఫైర్ అవుతూ ఉండేది. అలాంటివి అసలు చేయొద్దని తెగేసి చెప్పేసింది .


కానీ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఆ టాటోను చూసుకుంటూ మురిసిపోయినట్టు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా అషూ రెడ్డి, హరి మీద పలు రకాలుగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే అదంతా కేవలం టిఆర్పి రేటింగ్ కోసమే చేస్తున్నారని టాక్ బాగా వినిపించింది. మరికొందరు మాత్రం ఇదంతా నిజమేనని నమ్ముతూ ఉన్నారు. హరి కోసం ఆమె ఒక కాస్ట్లీ బైక్ను కూడా గిఫ్ట్ గా ఇచ్చింది. దీంతో వీరిద్దరి వ్యవహార ఎంతవరకు వెళుతుందో ఏమో కానీ తాజాగా మరొకసారి స్టేజి మీద రెచ్చిపోయారు ఈ జంట.


ప్రస్తుతం బుల్లితెరపై పార్టీ చేద్దాం పుష్ప-2  కు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల అయింది. ఇందులో స్టేజి మీద హరి మరొకసారి అషూ రెడ్డి కి ప్రపోజ్ చేయడం జరిగింది. హరి స్టేజ్ మీద మాట్లాడుతూ తను ఎప్పటికీ నాకు దేవతే అంటూ ప్రపోజ్ చేయడం జరిగింది. తను నా గుండెల్లో గులాబీ లాంటిది అని తెలియజేశాడు. ఇక అందుకు తగ్గట్టుగానే అషూ రెడ్డి ఏదో చెప్పబోయింది. ఈ వ్యవహారం ఎన్ని రోజులు నిలుస్తుందో చెప్పలేము. ఎందుచేత అంటే బిగ్ బాస్ ఇంట్లో కూడా చేసిన ప్రవర్తనలు చాలా వింతగా ఉన్నాయి. బిగ్ బాస్ లో కూడా అఖిల్ తో కనెక్ట్ అయినట్లుగా వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: