బుల్లితెరపై రష్మీ గౌతమ్ ప్రస్తుతం యాంకర్ గా మూడు షోలకు వ్యవహరిస్తున్నది. బుల్లితెరపై ఇప్పుడు ఇమే హవానే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఇక రష్మీ కూడా తన ఫోకస్ మొత్తం సినిమాల పైన కాకుండా బుల్లితెర మీద పెట్టిందని చెప్పవచ్చు. ఇక అందరిలాగా పక్క ఛానల్ వైపు కూడా ఇమే చూడడం లేదు దీంతో రష్మీకి బుల్లితెర పైన మంచి డిమాండ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఇక తన తోటి వారంతా కూడా ఎక్కువగా సినిమాలు ఇతర చానల్స్ వైపు చూస్తూ ఉంటే కానీ రష్మీ మాత్రం కేవలం మల్లెమాల సమస్త బ్యానర్ లోనే ఉన్నది.

ఇప్పుడు రష్మీ చేతిలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నది. అలా రష్మీ ఇప్పుడు మూడు షోలతో వారానికి మూడు రోజులు ప్రేక్షకుల ముందుకు కనిపించబోతోంది. అందుచేతనే రష్మీ కూడా తనను భరించండి అంటూ తన ఇంస్టాగ్రామ్ నుంచి అభిమానులకు ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంపై హీరోయిన్ లైలా కూడా స్పందించడం జరిగింది. అయితే ఇక్కడ రష్మీకి లైలాకి ఎక్కడ పరిచయం ఏర్పడిందా అని అభిమానులు సైతం ఆలోచిస్తూ ఉన్నారు.ఇదివరకు కూడా ఆ షో లో లైలా రెండు మూడు ఎపిసోడ్లలో కనిపించడం జరిగింది. తాజాగా రష్మీ మీద ఉన్న ప్రేమను కురిపిస్తూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. అందుకు రష్మీ కూడా తిరిగి ఒక ఎమోషనల్ రియాక్ట్ కూడా అయింది కొత్త వాళ్లు వచ్చేసరికి దయచేసి నన్ను భరించండి అంటూ రస్మి చేసిన ఒక పోస్ట్ పై లైలా స్పందించడం జరిగింది. నువ్వు ఏ షో చేసినా కూడా అదరగొట్టేస్తావ్.. యూ విల్ రాక్ ది షో .. నువ్వు చేసే ప్రతి షో ఆయన కూడా ప్రాణం పెట్టి చేస్తావు.. బాగ ఆ షో ను ముందుకు తీసుకువెళ్తావు అంటు రష్మీ పై ప్రశంసల వర్షం కురిపించింది లైలా ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: