మల్లెమాల వారు చేసే ఈవెంట్లు వారి కొత్త కొత్త ఆలోచనలు ప్రేక్షకులకు అంతు పట్టలేకుండా ఉన్నాయని చెప్పవచ్చు.. బుల్లితెర ఎంటర్టైన్మెంట్లో మల్లెమాల బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుందని చెప్పవచ్చు.. ఏ పండుగ అయినా సరే ఈటీవీలో కచ్చితంగా ఒక ఈవెంట్ ను నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి ఈవెంట్లు కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈసారి వినాయక చవితి పండుగ సందర్భంగా ఒక ఈవెంట్ ని నిర్వహించడం జరిగింది కానీ అందులో వినాయకుడి గురించి తప్ప మిగతా అంతా ఉందని చెప్పవచ్చు.. ఇక పాటలతో డ్యాన్సులతో జోకులతో తాజాగా ఒక ప్రోమోను విడుదల చేయడం జరిగింది.


ఈ ప్రోమోలో యాంకర్ రష్మీ అయితే అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది.. రష్మీకి ఇదివరకే పెళ్లి అయ్యిందని విడాకులు వచ్చాయి అంటూ ఏవో పిచ్చిపిచ్చి కథ లు కూడా వినిపించాయి. అయితే రష్మీ తల్లితండ్రులు మాత్రం విడిపోయారని రష్మీ చిన్నతనం నుంచి కూడా తన తల్లి దగ్గరే పెరిగిందని.. ఆమె పలు సందర్భాలలో తెలియజేసింది. అలాంటి రష్మీ ఇప్పుడు తాజాగా బ్రేకప్ బాధను అనుభవిస్తొందని అందరికీ అర్థమయ్యేలా ఒక పర్ఫామెన్స్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది.


ఈ ప్రోమో చూసిన ప్రతి ఒక్కరు ఈమెకు నిజంగానే బ్రేకప్ జరిగిందా అని అనుమానాలు కూడా కలిగిస్తోంది. లేదంటే కేవలం షో కోసమే ఇలా చేసిందా అనే విషయం అర్థం కావడం లేదు. అయితే కొంతమంది మాత్రం సుధీర్ను పెళ్లి చేసుకోవాలని అభిమానులు పదేపదే అడుగుతూ ఉండడంతో రష్మీ ఇలా చేస్తుంది అన్నట్లుగా భావిస్తున్నారు. దీంతో సుధీర్ రష్మీకి లవ్ స్టోరీ ఉందా బ్రేకప్ జరిగిందా అనే విషయంపై అందరికీ పలు అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ప్రతి ఒక్కరూ మాత్రం రష్మీ డ్యాన్స్ చూసి నెక్స్ట్ లెవెల్ లో ఉందనే విధంగా కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: