బిగ్ బాస్ సీజన్ 6 మొదలయ్యి అయిదు వారాలు అవుతున్నా ఇంకా హౌస్ లో ఉన్న సభ్యులకు సీరియస్ నెస్ రాలేదు అన్న భావన క్లియర్ గా తెలుస్తోంది. ఈ విషయం ప్రతిరోజూ మిస్ కాకుండా చూస్తున్న బిగ్ బాస్ అభిమాని ఎవరిని అడిగినా చెబుతారు. గతంలో జరిగిన అయిదు సీజన్ లు ఎప్పుడూ ఇలా లేవు అన్నది చాలా మంది భావన. ఇక ఈ సీజన్ లో తక్కువ అయినవి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే హౌస్ లో ఉన్న ఎవ్వరూ కూడా ప్రేక్షకులకు నచ్చే ఎంటర్ టైన్మెంట్ చేయడం లేదు. అయితే చేసే అవకాశం ఉన్న కొందరు కూడా మాకెందుకులే అంటూ ఉండిపోతున్నారు. ఉదాహరణకు: రేవంత్, ఫైమా, బాలాదిత్య, శ్రీహన్, సూర్య ల నుండి ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా ఆయిస్తున్నారు అని చెప్పక తప్పడం లేదు.

రేవంత్ తాను సింగర్ అని మరిచిపోయినట్లున్నాడు. ఎప్పుడో ఒకసారి సాధారణంగా ఒక రెండు మూడు లైన్ లు పాడడం మినహాయించి... అస్సలు సింగింగ్ లేదు. రేవంత్ లో ఎంత టాలెంట్ ఉందో.. అయన పాటలు విన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇంపాక్ట్ అయన టాలెంట్ వలనే..ఈ రోజు లక్షల్లో రేవంత్ కు బిగ్ బాస్ లాంటి గ్రేట్ షో లో పాల్గొనే అవకాశం కలిగింది. అయితే రేవంత్ ఇంకా ప్రేక్షకులకు అందించాల్సిన ఎంటర్ టైన్మెంట్ పైన ద్రుష్టి పెడితే బాగుంటుంది.

ఫైమా : జబర్దస్ లో తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగి బిగ్ బాస్ వరకు చేరుకున్న ఫైమాకు చాలా అభిమానులు ఉన్నారు. అందుకే తాను ఎలిమినేషన్ లో ఉన్న ప్రతిసారి వాళ్లంతా ఓట్లు వేసి తనను గెలిపిస్తునారు. కానీ దానికి ప్రతిఫలంగా ఫైమా ఇప్పుడు చేస్తున్న కామెడీ సరిపోదు. ఇంకా ఎక్కువగా చేస్తేనే జబర్దస్త్ పేరును సార్ధకం చేసినట్లు అవుతుంది.

ఇక వీరిద్దరూ మాత్రమే కాకుండా.. బాలాదిత్య, శ్రీహన్ లకు నటనలో అనుభవం ఉంది. మరి వారెందుకు ఎంటర్ టైన్మెంట్ మీద ద్రుష్టి పెట్టడం లేదన్నది కూడా కొందరు ఆలోచన.  సూర్య కూడా ఇంకా మెరుగవ్వాల్సిన అవసరమా ఉంది. మరి వీరంతా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తారని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: