బుల్లితెరపై యాంకర్ శ్యామల అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె యాంకర్ గా ఎంతో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఇటీవల కొన్ని కామెంట్లతో వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. సీనియర్ నటుడు రవీంద్ర యాంకర్ శ్యామలను ఉద్దేశిస్తూ స్టేజ్ మీదనే ఆంటీ అంటూ సెటైర్లు వేయడం జరిగింది. ఇక తగ్గేదేలే సినిమా రేపటి రోజున విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే నిర్వహించడం జరిగింది. ఈవెంట్ కి యాంకర్ గా శ్యామల వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి నటుడు రాజ రవీంద్ర కూడ వచ్చారు.


ఈ సందర్భంగా రాజా రవీంద్ర సినిమా గురించి నిర్మాతల గురించి మాట్లాడుతూ ఉన్న సమయంలో చివరిగా శ్యామల ఆంటీకి కూడా థాంక్యూ అంటూ ఆమె పైన సెటైర్లు వేయడం జరిగింది.. ఆ వెంటనే శ్యామల..నేను ఆంటీ ని అయితే మీరు తాత అయిపోయినట్టే అని రివర్స్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. గత కొద్ది నెలల క్రితం ఆంటీ అనే పదం తెలుగు మీడియా రంగంలో పెద్ద వివాదంగా మారుతున్న సంగతి అందరికీ తెలిసిందే.


ప్రముఖ యాంకర్ అనసూయని ఆంటీ అని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ చేయడం జరిగింది నేటిజన్స్. ఆంటీ అనే పదం ఏజ్ షేమింగ్ కిందికి వస్తుంది అంటూ అనసూయ చాలా సీరియస్ కావడం జరిగింది. ఈ వివాదం అప్పట్లో పలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఇప్పుడు మరొకసారి ఇదే ఆంటీ అనే పదంతో సీనియర్ నటుడు రాజా రవీందర్ యాంకర్ శ్యామలాను అనడంతో మరొకసారి ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయం ఎక్కడ వరకు దారితీస్తుందో చూడాలి మరి. ఏది ఏమైనా యాంకర్ శ్యామల నీ చూస్తే ఆంటీ అని ఎవరికి పిలవాలనిపించదని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: