బిగ్ బాస్ సీజన్-6 పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. అయితే తొమ్మిదవ వారం ఎలిమినేట్ అయిన కనిపిస్టెంట్ గీతూ రాయల్ ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి గీతూ పేరు బిగ్ బాస్ లో బాగా వినిపించింది. మొదటి వారంలో ఎవరు పెద్దగా గేమ్ ఆడని సమయంలో గీతూ ఆట తీరుపై ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ గా చూపించారు. అయితే ఈ కార్యక్రమంలో ఈమె ఇతర ఇంటి సభ్యులపై నోరు పారేసుకోవడం ఆ తర్వాత ఓవరాక్షన్ చేయడం వంటి వల్ల ఈమె కొద్ది వారాలకే అట్టర్ ప్లాప్ గా మారిపోయింది. దీంతో తొమ్మిదో వారం నామినేషన్లు గీతూ ఓటింగ్ ద్వారా ఆడియన్స్ను బయటికి పంపించేలా చేయడం జరిగింది.


ఏమాత్రం ఊహించని రీతిలో ఎలిమినేట్ కావడంతో గీతూ గోరంగా ఏడ్చింది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత, వేదిక పైన కూడా నాగార్జునను పట్టుకొని లైవ్ లో ఏడవడం జరిగింది గీతూ.ఇక తన ఎలిమినేషన్ ని అంగీకరించలేకపోతున్నానంటు తెలియజేసింది. అయితే ఇ తరుణంలో ఎలిమినేషన్ అయి బయటికి వచ్చిన గీతూ కి బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే హరి శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించినబోతున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో గీతూకి అవకాశం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ చిత్రంలో ఈమెది సీరియస్ రోలని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలో అవకాశం రావాలి అంటే అది మామూలు విషయం కాదని చెప్పవచ్చు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో పాటు చిత్తూరు యాస భాషలు ఎంతో అద్భుతంగా మాట్లాడుతూ ఉంటుంది. దీంతో గీతు కెరియర్ పరంగా వెనక్కి చూసుకోలేదని చెప్పవచ్చు. ఇక పవన్ చిత్రంలోనే కాకుండా పుష్ప -2 సినిమాలో కూడా ఈమెకు అవకాశం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ రెండు ప్రాజెక్టులలో గీతూ నటిస్తే ఈమె కెరియర్ మారిపోయినట్టే అని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: