హైపర్ ఆది బుల్లితెర ప్రేక్షకులకు.. వెండితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. జబర్దస్త్ లో రైటర్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది తన పంచ్ డైలాగులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు . ముఖ్యంగా ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుధీర్ స్కిట్ కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురు చూసేవారో హైపర్ ఆది స్కిట్ కోసం కూడా అంతే స్థాయిలో ఎదురు చూసేవారని చెప్పవచ్చు. ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా ప్రతి ఆదివారం మధ్యాహ్నం టెలికాస్ట్ కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా హైపర్ ఆది లీడ్రోల్ ప్లే చేస్తూ ఉన్నారు.

ముఖ్యంగా హైపర్ ఆదికి ఎన్నో చానల్స్ లో అవకాశాలు వస్తున్నా  జబర్దస్త్ మల్లెమాల వారిని వదిలిపెట్టి వెళ్లలేదు. ముఖ్యంగా హైపర్ ఆది చెప్పేటువంటి డైలాగ్స్ ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా హైపర్ ఆది చెప్పే డైలాగులన్నీ కాంట్రవర్సీలుగా ఉంటాడు. బుల్లితెర ప్రేక్షకులు తెలియజేస్తూ ఉంటారు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎప్పుడు ఏదో ఒక షాకింగ్ స్కిట్ ని చేస్తూ ఉంటారు . గత వారం యూట్యూబ్  థంబ్ నెయిల్స్ ఒక స్కిట్ చేయడం జరిగింది.

ఇప్పుడు ఏకంగా ఒక షాకింగ్ టాస్క్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  ఓ నెంబర్ ని సెలెక్ట్ చేసుకోవాలి అందులో వెనుక ఏముంటే అది చేయాలని యాంకర్ రష్మీ తెలియజేస్తుంది.  ఇందులో భాగంగానే ఆది 11 నెంబర్ ను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది.  అందులో గుండు కొట్టించుకోవాలి అని రాసి ఉంటుంది దీంతో మిగతా కమెడియన్స్ అందరూ హైపర్ ఆదికి గుండె కొట్టించాల్సిందే అంటూ పట్టుబడతారు.  అందుకు సంబంధించి హైపర్ ఆది గుండు కొట్టించుకున్నట్లు ఈ ప్రోమోలో చూపించడం జరుగుతోంది మరి ఇదంతా కేవలం టిఆర్పి రేటింగ్ కోసమే అన్నట్లుగా పలువురు నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.  గతంలో కూడా మల్లెమాల సంస్థ ఇలాంటివి చాలానే చేసిందని కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: