బుల్లితెర సీరియల్స్ ద్వారా తన కెరీర్ను మొదలుపెట్టి అనతి కాలంలోనే జబర్దస్త్ లోకి అడుగుపెట్టి లేడీ కమెడియన్ గా మరింత గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  నిజానికి మొదట సీరియల్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈమెకు జబర్దస్త్ వల్లే మంచి పేరు గుర్తింపు లభించాయి ముఖ్యంగా జబర్దస్త్ లో అజార్ అనే ఆర్టిస్టుతో ఈమెకు రిలేషన్ చూపించి వీళ్ళ జంటకు బాగా హైప్ తీసుకొచ్చారు మల్లెమాల ఆ తర్వాత జబర్దస్త్ రీతుగా ఫిక్స్ అయిపోయింది ఈమె పేరు. అయితే అందం,  అమాయకత్వం, ఎన్ని పంచులు వేసిన నవ్వుతూ ఉండడం చూసి ప్రేక్షకులకు ఈమె బాగా నచ్చేది.

సీరియల్స్ లో నెగిటివ్ పాత్రలు చేస్తూ ఒకింత గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి జబర్దస్త్ లో మాత్రం చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఫిదా చేస్తోంది. ఇటీవల ఒకవైపు జబర్దస్త్ లో బిజీగా ఉంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటుంది హీరోయిన్లను మించే అందంతో లేటెస్ట్ గ్లామర్ ఫోటోషూట్లతో మరింత రచ్చ చేసే ఈమె  తాజాగా ఇన్స్టాగ్రామ్ లో మరికొన్ని ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు సైతం విపరీతంగా నెట్టింట మంట పెడుతున్నాయి. ఇటీవల తన లైఫ్ లో జరిగే ప్రతి విషయం , ప్రతి వెకేషన్ కి  సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ ఆమె పెళ్లి కూడా జరగబోతోంది అంటూ ఒక అబ్బాయి తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది.

రాజకీయ నేపథ్యం ఉన్న కుర్రాడితో ప్రేమలో పడిందని... ఇద్దరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి కానీ ఆ తర్వాత మళ్లీ పెళ్లి విషయంపై ఎలాంటి వార్తలు రాలేదు.  ప్రస్తుతం అటు జబర్దస్త్ ఇటు సీరియల్స్ లో బిజీగా ఉంది రీతూ చౌదరి. మరి సినిమాల్లోకి వెళ్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: