తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. బుల్లితెరపై ఉండేటువంటి క్రేజ్ తోనే పలు సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటిస్తోంది అనసూయ. అలా ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించింది. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉన్నప్పటికీ పలు సినిమాలలో మాత్రం నటిస్తూ ఉంటోంది అనసూయ. అయితే ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీలో ఒక విషయంపై మరొక సారి హాట్ టాపిక్ గా మారుతోంది అనసూయ. ముఖ్యంగా హిట్-3 సినిమా విషయంలో అనసూయ పేరు చాలా వైరల్ గా మారుతోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

హిట్ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ నటించి మంచి విజయాన్ని అందుకున్నారు.  అడవి శేష్ హిట్ -2 సినిమాలో నటించి మరింత విజయాన్ని అందుకున్నారు.  దాదాపుగా ఈ సినిమా మొదటి రోజు రూ. 11 కోట్ల రూపాయలు వసూళ్ల చేయడంతోపాటు రూ.28.1 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లుగా సమాచారం. దీంతో అడవి శేష్ ఖాతాలో మరొక సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా హీరోనా అని వ్యవహరించారు. డైరెక్టర్గా శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.


హిట్ -2 సినిమాలో చివరిలో నాని హిట్ -3 సినిమాలో నటించబోతున్నట్లుగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. హిట్ -2 సినిమాల సైకో కిల్లర్ ప్రవర్తించిన తీరుని ప్రేక్షకులకు సైతం ఒళ్ళు గగుర్పొడిచేలా కనిపిస్తూ ఉన్నాయి.. హిట్ -2  సినిమాలలో ఎప్పుడు తప్పులు అమ్మాయిలు మాత్రమే చేస్తారా? అబ్బాయిలు చేయరా? సీరియల్ సైకో కిల్లర్ అబ్బాయిలే ఉంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హిట్ -3 సినిమాలలో అబ్బాయిల్ని చంపే అమ్మాయిగా అనసూయని చూపించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో మరొకసారి అనసూయ పేరు వైరల్ గా మారుతోంది. దీంతో మరొకసారి హిట్ -3 సినిమాకి ఫ్రీగా పబ్లిసిటీ దొరుకుతోందని చెప్పవచ్చు. మరి ప్రేక్షకులు ఇచ్చిన సలహాలతో అనసూయ నటిస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: