అనసూయ ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె యాంకర్ గా కంటే యాక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాతే ఈమె క్రేజ్ భాగారిగా పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా మారుతూనే ఉంటుంది.. మొదటిసారి న్యూస్ రీడర్గా తన కెరీయర్ని మొదలుపెట్టిన అనసూయ జబర్దస్త్ యాంకర్ గా క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించి సక్సెస్ పుల్ యాక్టర్ గా పేరు సంపాదించింది.


అనసూయ కెరీయర్ని రంగస్థలం సినిమానే మలుపు తెప్పింది. ఆ తర్వాత ఈమె నటించిన ప్రతి సినిమాలోని పాత్ర కూడా సక్సెస్ కావడంతో ప్రస్తుతం బిజీ యాక్టర్ గా మారిపోయింది. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. దీంతో ఇటీవలే బుల్లితెరకు కూడా గుడ్ బై చెప్పేసింది అనసూయ. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాగే తన కుటుంబం పైన కానీ తన పైన కానీ ట్రోల్ చేసే వారిని అసలు వదిలిపెట్టదు.


ఈ వయసులో కూడా అనసూయ యంగ్ స్టార్లకు సైతం పోటీగా నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఫిజిక్ మెయింటైన్ చేయడంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. ఎలాంటి దుస్తులలో నైనా చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది అనసూయ. అనసూయ చేసిన ఒక పోస్ట్ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. అదేమిటంటే సమ్మర్ సీజన్ మొదలు కావడంతో మామిడికాయల గురించి ఒక ఆసక్తికరమైన పోస్ట్ ని పెట్టింది. ఈ ఫోటోలకు అనసూయ మామిడికాయల వేట స్టార్ట్ అయింది. ఇదొక సీరియస్ ఎఫైర్ అంటూ రాసుకుంది. ప్రస్తుతం అనసూయ రాసకొచ్చిన ఈ ఎఫైర్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో పలువురు అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: