తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు ముక్కు అవినాష్.. జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న అవినాష్ సినిమాలలో నటించడమే కాకుండా బిగ్ బాస్ షోలో కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే అనుకోకుండా జబర్దస్త్ కార్యక్రమాన్ని మానేసిన ముక్కు అవినాష్ బిగ్ బాస్ లో బాగానే సందడి చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు మళ్ళీ ఎక్కడ ఈటీవీ కార్యక్రమాలలో పెద్దగా కనిపించలేదు. ఎక్కువగా స్టార్ మా చానల్స్ లో మాత్రమే కనిపిస్తూ ఉన్నారు.


తాజాగా ఈయన రీతు చౌదరి హోస్టుగా వ్యవహరిస్తున్న దావత్ కార్యక్రమానికి హాజరయ్యారు.ఇందులో రీతూ చౌదరి ముక్కు అవినాష్ ను ప్రశ్నిస్తూ జబర్దస్త్ షో మానేయడానికి గల కారణమేంటి అంటూ ప్రశ్నించగా అందుకు అవినాష్ తెలియజేస్తూ ఎవరైనా ముందుకు వెళ్లాలని కోరుకుంటారు.. తాను కూడా అంతే  ముందుకు వెళ్లాలని ఉద్దేశంతోనే జబర్దస్త్ ని మానేయడం జరిగింది అంటూ తెలిపారు. కరోనా సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నాలు కూడా వెళ్లాలని ఉద్దేశంతోనే జబర్దస్త్ ని మానేయడం జరిగింది అంటూ తెలిపారు. కరోనా సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను ఆ సమయంలో సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు కూడా తనకి వచ్చిందని.


ఆ సమయంలోనే బిగ్ బాస్ నుంచి అవకాశం రావడంతో చాలా సంబరపడిపోయాను.. బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అంటే ఈటీవీలో చేస్తున్న జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి మల్లెమాల వారితో అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేయించుకోవాలి.. దాదాపుగా 10 లక్షల రూపాయల వరకు అక్కడ కట్టాల్సి ఉంటుంది అంటూ తెలిపారు. ఆ సమయంలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో శ్రీముఖి వద్ద ఐదు లక్షల రూపాయలు సహాయంగా అడిగానని స్నేహితుల ద్వారా మరో ఐదు లక్షల రూపాయలు తీసుకొని మల్లెమాలవారికి కట్టేసి బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డారని తెలిపారు అవినాష్. బిగ్బాస్ షోనే తనకు పునర్జన్మ ఇచ్చింది అంటూ తెలిపారు. అవినాష్ చెప్పిన మాటలను బట్టి రాబోయే రోజుల్లో జబర్దస్త్ షో కి కూడా వెళ్లే అవకాశం లేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: