బిగ్ బాస్ షో అనేది ఇప్పుడు అన్ని భాషలలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. టిఆర్పి రేటింగ్ పరంగా కూడా ప్రసారాలకు రేటింగ్ పెరుగుతోంది. ఇండియాలో బిగ్ బాస్ షో కి మంచి క్రేజీ కూడా ఉన్నది. మొదట హిందీలో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ షో ఆ తర్వాత సౌత్లో అన్ని భాషలలో కూడా  పాపులారిటీ సంపాదించుకున్నది. ముఖ్యంగా హిందీలో సల్మాన్ ఖాన్ పోస్ట్ గా ఉండగా తెలుగులో నాగార్జున తమిళంలో కమలహాసన్ వంటి వారు హోస్టుగా చేస్తున్నారు.


తాజాగా హిందీలో బిగ్బాస్ ఓటింగ్ సీజన్-3 ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఈ షో కి ప్రముఖ యూట్యూబర్ ఆర్మాన్ మాలిక్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు..అయితే ఈయన సింగిల్ గా కాకుండా ఏకంగా తన ఇద్దరు భార్యలతో ఎంట్రీ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సైతం దుమ్మెత్తి పోస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విపరీతమైన ధోరణి ద్వారా ఎలాంటి సందేశాలు ఇవ్వాలంటూ పలువురు నెటిజెన్స్ ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ని ప్రశ్నిస్తున్నారు. ఆర్మాన్ తన ఇద్దరు భార్యలు పాయల్ ,కృతికలతో హౌస్ లోకి అడుగుపెట్టడం జరిగింది.


ముఖ్యంగా తన భార్యలు ఇద్దరు ప్రేమ గురించి చాలా వివరిస్తూ ఉన్నారు. ఇది చూడడానికి చాలా అసభ్యకరంగా కనిపిస్తున్న దీనికి వ్యతిరేకంగా కూడా చాలామంది కామెంట్లు చేస్తున్నారు. తాజాగా దీనిపైన బుల్లితెర సీనియర్ నటి స్పందిస్తూ ఆర్మన్ మాలిక్ లాంటి వ్యక్తి ఇద్దరు భార్యలతో కలిసి హౌస్ లోకి అనుమతించి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అంటూ బుల్లితెర నటి దేవోలిన ప్రశ్నించింది. అంతేకాకుండా ఈ షో ని పిల్లలు పెద్దలు అందరూ చూస్తూ ఉన్నారు వారందరూ కూడా మీలాగా ఆలోచిస్తే ఎలా అంటూ ఆమె ప్రశ్నించింది.. దీనిని వినోదం అని ఎవరు అనరు ఏమంటారు తనకి కూడా అర్థం కావడం లేదు అంటూ తెలిపింది. ఇలాంటి వారిని ఇళ్లల్లో ఉంచడం మంచిది సమాజంలోకి తీసుకురాకండి అంటూ ఫైర్ అయ్యింది బుల్లితెర నటి.

మరింత సమాచారం తెలుసుకోండి: