2003లో జగపతిబాబు నటించిన ధమ్ అనే చిత్రం ద్వారా నటించిన చైతన్య కృష్ణ ఆ తర్వాత చాలా గ్యాప్ తో బ్రీత్ అనే ఒక త్రిల్లర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కూడా ప్లాప్ గా మిగిలిపోయింది దీంతో చాలామంది ట్రోల్ కూడా చేశారు. చంద్రబాబు బాలయ్య బంటు వారికి పొలిటికల్ బలంగా కూడా సపోర్టివ్ గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. అలాంటి చైతన్య కృష్ణ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయం పైన ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియా పాపులర్తి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికీ విడుదలైన మూడు ప్రోమోలో కూడా బిగ్ బాస్ -8 కి సంబంధించి మూడు ప్రోమోలు కూడా హైలెట్గా నిలవడమే కాకుండా నాగార్జున చూపించారు. వచ్చేనెల 8వ తేదీన బిగ్ బాస్ షో అధికారికంగా లాంచింగ్ ఎపిసోడ్ మొదలు కాబోతోందని హౌస్ నిర్వాహకులు నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికే బిగ్ బాస్-8 కి కావాల్సినంత క్రేజ్ కూడా వచ్చేస్తోంది.