ఈ మధ్య మొగుడు,పెళ్ళాం,బిడ్డల మధ్య గొడవలు కూడా స్టార్ట్ అవుతున్నాయి.

దానికి ఒకే ఒక్క కారణం "బిగ్ బాస్"అనే షో.ఎందుకంటే బిగ్ బాస్ షో ముగింపుకు వచ్చింది.వరుణ్ సందేష్,శ్రీముఖి,రాహుల్ సిప్లి గంజ్ వంటి వారు ఫైనల్ స్టేజికి రావడంతో బిగ్ బాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.దాంతో తమ తమ అభిమాన కంటెస్టెంట్ కోసం అభిమానులు కూడా తమ వంతు కృషి తాము చేస్తూ ఇప్పుడు ఏకం గా వెర్రి అభిమానం మరీ తీవ్ర స్థాయికి చేరుకుంది.

అప్పట్లో కౌషల్ అనే బిగ్ బాస్ విన్నర్ కోసం అభిమానులు పడిన కష్టం అంతా ఇంతా కాదు ఏకం గా ఆర్మీ అని ఏర్పాటు చేసి రోడ్ల పై నినాదలు చేస్తూ,ఒక వైరల్ గా మార్చి చివరగా కౌషల్ ని విజేత గా నిలబెట్టారు.అలా మళ్ళీ ఇప్పుడు రాహుల్ కోసం ఒక ఆర్మీని పెట్టి ఈ పాత బస్తి కుర్రాడిని కూడా అందలం ఎక్కించనున్నారు.

ఇలానే ఆర్మీ ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపొయ్యి విజయం వాకిట నిలవాలన్నది అభిమానుల కోరిక అని అందుకోసమే రాహుల్ అభిమాన సంగం ఒక ఆర్మీ గా ఏర్పడి రాహుల్ కి విజయం ఇచ్చేలా ఉన్నారంటూ మరో పక్క శ్రీముఖి కూడా ఇలానే ఆర్మీ ఉండి ఆ ఆర్మీ చేసిన చిన్ని అవమానం కోసమే ఈ రాహుల్ అభిమాన ఆర్మీ ఏర్పడింది అని స్పష్టం చేసారు.కానీ రాహుల్ కి ఉన్న క్రేజ్ పెద్ద హీరోకి ఉన్నదానికంటే కూడా ఎక్కువ ఉంది అని అందరూ భావిస్తున్నారు.ఈ అభిమానులు వల్ల అభిమానం కట్టలు తెంచుకోకుండా ఆరోగ్యకరంగా సంబంధాలు ఉన్నంత కాలం ఏం కాదు కాని ఒక్కోసారి ఆ అభిమానం కట్టలు తెంచుకొని ఏమన్నా అవుతుందేమో అని అందరికి ఒక విధమైన భయం మొదలు అయ్యేలా ఉంది.రాహుల్ ఆర్మీ చేసే వండర్స్ ఏంటో, ఎలాంట విజయం రాహుల్ కి ఇవ్వనున్నారో ఫైనల్స్ వరకు వేచి చూడాలి అంటున్నారు బిగ్ బాస్ ని ఫాలో అయ్యే విశ్లేషకులు.చూద్దాం బిగ్ బాస్ ఎవర్ని విజేతను చెయ్యనున్నదో ...

మరింత సమాచారం తెలుసుకోండి: