తెలుగు బుల్లితెర‌పై బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజ‌న్-3కి రంగం సిద్ధమ‌వుతోంది. ఈ సారి బిగ్‌బాస్ షో ఎలా ఉంటుంద‌నే విష‌యంపై ఆస‌క్తిక‌ర ఉహాగానాలు వినిపిస్తున్నాయి. గ‌త రెండు సీజ‌న్‌ల‌కు మంచి రెస్పాన్స్ రావడంతో బిగ్‌బాస్ 3 మరింత ఆకట్టుకునే విధంగా ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3కి హోస్ట్ ఎవరనే చర్చ జరుగుతుంటే, కంటెస్టెంట్స్ గురించి కూడా ఆసక్తికర స‌మాచారం వినిపిస్తోంది.  
ఫ‌స్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా చేశాడు. అయితే 3వ సీజన్ కు హోస్ట్స్ గా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. తార‌క్‌తో పాటు నాగార్జున‌, బ‌న్నీ, విజయ్ దేవరకొండ... వంటి స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. RRR ప్రాజెక్టుతో బిజీగా ఉన్న తార‌క్.. బిగ్‌బాస్‌కు టైమ్ కేటాయిస్తాడా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్.
మ‌రోవైపు బిగ్ బాస్-3లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ విషయంలో కూడా అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. బుల్లితెర రంగంలో పాపులర్ అవుతున్న‌ సెలెబ్రిటీలని బిగ్ బాస్ 3లోకి సభ్యులుగా ఎంపిక చేసుకోబోతున్నట్లు కొందరి పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. రెగ్యూల‌ర్‌గా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ లాంటి సెలెబ్రిటీలని బిగ్ బాస్ 3 కోసం ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. 
బిగ్‌బాస్-3 కంటెస్టెంట్స్ వీళ్లేనా అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్టు ప్ర‌కారం.. టీవీ నటి హరిత, సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ, వరుణ్ సందేశ్, యాంకర్ ఉదయభాను, సింగర్ హేమచంద్ర దాదాపుగా బిగ్ బాస్ 3 కోసం ఫైనల్ అయిపోయారని ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ నిర్వాహకులు మరికొందరి పేర్లని కూడా పరిశీలిస్తున్నారు అంటూ ఇంకో జాబితా వైరల్ అవుతోంది. అందులో జబర్దస్త్ పొట్టి నరేష్, టివి ఆర్టిస్ట్ జాకీ, నటుడు కమల్ కామరాజు, రేణు దేశాయ్, గుత్తాజ్వాల, మనోజ్ నందన్, రఘు మాస్టర్, నాగ పద్మిణి, యాంకర్ ప్రదీప్ పేర్లు వైరల్ అవుతున్నాయి. 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లిస్టులోని వారే ఎక్కువ మంది బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బిగ్ బాస్ 2లో కామ‌న్‌మేన్‌కు కూడా అవకాశం ఇచ్చారు. బిగ్ బాస్ 3లో ఎంతమంది సామాన్యులని తీసుకుంటారన్న‌ది ఆస‌క్తిగా మారింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: