తెలుగు రియాల్టీ షో "బిగ్ బాస్"  సీజన్ త్రీ ఆదివారం జూలై 21 న ప్రారంభం కానుంది. అయితే, బిగ్ బాస్ ఇప్పటికే పలు ఆరోపణలకు గురైంది. ఈ రియాల్టీ షో లో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతుందనీ, ఆర్గనైజర్స్ ఇబ్బందులు పెడుతున్నారంటూ శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా వంటి నటీమణులు పలు ఆరోపణలు చేసి, కోర్ట్ లో కేసు కూడా వేసిన సంగతి తెలిసిందే.



అదే క్రమంలో బిగ్ బాస్ షో ను రద్దు చేయాలంటూ, 'ఉస్మానియా' విద్యార్థులు కూడా హెచ్చరించారు.అంతేకాకుండా, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా విద్యార్ధులు బిగ్ బాస్ షో ను ఆపాలని చెప్పారు.



లేకుంటే షో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు నాగార్జున అక్కినేనికి సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోను ముట్టడించాలని నిర్ణయించుకున్నారు. కందుల మధు ఆధ్వర్యంలో ఓయూ విద్యార్ధులు బయల్దేరారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: