బిత్తిరి సత్తి.. ఈ పేరు కు ఇప్పుడు ఇంట్రడక్షన్ అవసరం లేదు. వీ6 ఛానల్ ద్వారా పరిచయమై.. ఆ ఛానల్ లోని తీన్మార్ వార్తల ద్వారా బాగా పాపులర్ అయిన ఆర్టిస్ట్ బిత్తిరి సత్తి.. అసలు పేరు చేవెళ్ల రవి.. ఆ తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్ ద్వారా బాగా ఫోకస్ అయిన బిత్తిరి సత్తి.. ఆ తర్వాత అనేక సినిమాల్లోనూ నటించాడు.. నటిస్తున్నాడు.


వీ 6 ఛానల్ ఐకాన్ గా ఉన్న బిత్తిరి సత్తి ఇప్పుడు ఆ ఛానల్ కు షాక్ ఇచ్చాడు. అనూహ్యంగా ఆయన టీవీ9 ఛానల్లో చేరాడు. తెలంగాణ యాసతో, తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తూ బలంగా ప్రజల్లోకి దూసుకెళ్లిన వీ 6 న్యూస్ ఛానల్ కు ఇది షాక్ గానే చెప్పొచ్చు.


ఈ ఛానల్లో ఆఫ్ బీట్ వార్తలకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. టీఆర్పీ రేటింగ్స్ కూడా బాగా వస్తాయి. ఈ అనూహ్య మార్పు వెనక ఏం జరిగిందన్నది ఇప్పడు ఇంట్రస్టింగ్ మారింది. ఇటీవల టీవీ9 ఛానల్ యాజమాన్యం చేతులు మారిన సంగతి తెలిసిందే.


నిన్న మొన్నటి వరకూ టీఆర్ఎస్ లో ఉన్న వీ6 ఛానల్ అధినేత జి.వివేక్ కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరారు. ఇక టీవీ 9 యాజమాన్యమైన మైహోమ్ గ్రూప్ రామేశ్వరరావుకు కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: