బిగ్ బాస్ సీజన్ 3లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లలో పున్నూ.. పార్టిసిపేట్ చేసింది తక్కువే. కంటెస్టెంట్స్ అందరూ హోరా హోరాగా పోరాడుతుంటే తను మాత్రం రిలాక్స్ మోడ్‌లోనే ఉండేది.  నాకెందుకొచ్చిన గేమ్‌లు రాహుల్‌ని నాలుగు తిట్లు, రెండు రొమాంటిక్ ముచ్చట్లు, వరుణ్- వితికాలతో ఇతరులపై చాడీలు చెప్తే బిగ్ బాస్ మనల్ని చూపించకపోతాడా అన్నట్టుగానే కానిచ్చేసింది. ఇక చాలమ్మా పున్నూ అంటూ  11 వ వారంలో ప్రేక్షకులు ఆమెను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపేశారు. బిగ్ బాస్ సీజన్ 3లో టాస్క్‌లలో పెద్దగా పెర్ఫామ్ చేయకపోయినా.. మిగతా ఇంటిసభ్యుల్లా గేమ్‌లో ఇన్వాల్వ్ కాలేకపోయినా 11 వ వారం వరకూ ఎలిమినేట్ కాకుండా  కొనసాగింది పునర్నవి. 


కారణం  ఆమె డ్రెస్సింగ్‌కి మేకప్‌ కి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. ఆమె ఎలిమినేషన్‌‌తో పాపం అక్కడ రాహుల్ దు:ఖ సాగరంలో మునిగిపోయి బెంగపెట్టుకుంటుంటే పునర్నవి మాత్రం రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ వరుస ఇంటర్వ్యూలతో బిజీ అవుతుంటే పునర్నవి మాత్రం రెస్ట్ తీసుకుంటోంది.   పునర్నవి  తన గ్లామర్‌ కి ఫేస్ బుక్‌లో2 మిలియన్స్ పైనే ఫాలోయింగ్ ఉందంటే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.  


 అయితే తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి టచ్‌లో ఉండేందుకు తన లేటెస్ట్ ఫొటో వదిలింది.  బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు దట్టమైన మేకప్‌తో గ్లామర్ టచ్ ఇచ్చే పునర్నవి మేకప్ తీసేసరికి బరువు తగ్గిందో ఏమో కాని.. ఫేస్‌లో గ్లో మొత్తం పోయి ఈమె పునర్నవేనా అన్నట్టుగా ఉంది. ఇక ఆమె ఫొటో సంగతి పక్కన పెట్టేస్తే.. ఈ ఫొటోకి ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా పెట్టింది. ‘నా మనసు, శరీరానికి జరిగిన డ్యామేజీ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్నా.. బట్.. అందరికీ దసరా శుభాకాంక్షలు.

ఈ పండుగ ముందు ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ తన అభిమానుల్ని ఆందోళనలో పడేసింది. బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లడం వల్ల మనసుకు డ్యామేజ్ అయ్యిందంటే ప్రేక్షకులకు తెలియనిది ఏదో జరిగి ఉండవచ్చు.  అయితే ఆమె శరీరానికి గాయం అయ్యే ఛాన్సే లేదే.. ఎందుకంటే ఆమె  మరి ఆమె శరీరానికి డ్యామేజ్ ఏం జరిగిందోనని పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: