నీరసంగా సాగుతున్న బిగ్ బాస్ షోకి హైప్ ఇచ్చేందుకు దసరా కానుకగా మంగళవారం నాటి ఎపిసోడ్‌లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. కంటెస్టెంట్స్ అందరూ రకరకాల వంటలతో బిగ్ బాస్ హౌస్‌ను ఘుమఘుమలాడించారు. ఈ ఐటమ్స్ను టేస్ట్ చేయడానికి స్పెషల్ గెస్ట్ వస్తారని బిగ్ బాస్ హింట్ ఇవ్వడంతో స్వీట్ చేయడానికి పోటీ పడ్డారు కంటెస్టెంట్స్. 

ఒక స్వీట్‌ని టేస్ట్ చేయడానికి ఎవరు వస్తారని ఎదురుచూస్తుండగా..‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ పంచె కట్టులో(బంగార్రాజు గెటప్‌లో) ఎంట్రీ ఇచ్చిన నాగార్జునను చూసి కంటెస్టెంట్స్ సందడి చేశారు. 
కేకలు, ఈలలు, డాన్స్‌లతో నాగార్జునకు స్వాగతం పలికారు. వాళ్లు చేసిన స్వీట్స్ నాగార్జునకి పెట్టారు. రెండు గ్రూప్స్ స్వీట్లను టేస్ట్ చూసిన నాగార్జున.. బాబా భాస్కర్ తయారు చేసిన స్వీట్ కంటే.. రితిక, శ్రీముఖి వాళ్లు తయారు చేసిన స్వీటే చాలా బాగుందని చెప్పారు. 

దాంతో బాబా భాస్కర్ ‘అదంతా స్టాటజీ సార్.. ఫస్ట్ వాళ్లు పెట్టారు కాబట్టి అదే మీకు నచ్చింది సార్’ అన్నారు.  దాంతో ‘నువ్వు కుకింగ్ బాగా చేస్తావని తెలుసు.. కానీ ఇవాళ మాత్రం వాళ్లదే బాగుంది’ మహిళల టీంకే మద్దతు తెలిపారు మన్మథుడు. దీంతో శ్రీముఖి, వితిక, శివజ్యోతి ఫుల్ షుషీ అయ్యారు.అనంతరం నాగార్జున వెంట తీసుకువచ్చిన స్వీట్స్ అండ్ గిఫ్ట్స్‌ని ఇంటి సభ్యులకు అందించారు. ‘మీరంతా నాకు తెలియకుండానే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.

మా ఇంట్లో కూడా మీ పేర్లు అన్నీ తెలుసు. వాళ్లకి రోజూ నేను కూర్చోబెట్టి మీ గురించి చెబుతుంటాను’ అంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.ఇక బిగ్ బాస్ హౌస్‌లో మన్మథుడి సందడి అపుడే అయిపోలేదు.. ఈ రోజు ఎపిసోడ్‌లో కూడా కంటిన్యూ చేస్తున్నారు.ఈ రోజు షోలో.. నాగార్జున కంటెస్టెంట్స్‌తో ఫన్నీ టాస్క్‌లు చేయిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: