నోకియా 210 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ఫోన్‌ను బడ్జెట్‌ధరలో గ్రామీణ వినియోగ దారులకు అందుబాటులో ఉంచింది.
 హెచ్‌ఎండీ గ్లోబల్‌ తన నోకియా మరో ఫీచర్‌ ఫోన్‌ను మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (ఎండబ్ల్యూసీ) 2019లో విడుదల చేసింది.
2జీ సపోర్టు, డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఫేస్‌బుక్‌ తోపాటు రెగ్యులర్‌ స్నేక్‌ గేమ్‌ను కూడా ఇందులో పొందుపర్చింది.
చార్‌కోల్‌, రెడ్‌, గ్రే కలర్‌ ఆప్షన్లలో లభిస్తున్న ఈ మొబైల్‌ ధర సుమారు రూ.2,500. త్వరలో ఈ ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 

నోకియా 210లో ఉన్న ఫీచర్లు 
2జీబీ ర్యామ్‌,16 ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
 వీజీఏ రియర్‌ కెమెరా విత్‌ ఫ్లాష్‌ 2.4 ఇంచుల డిస్‌ ప్లే 
ఎఫ్‌ఎం రేడియో,
ఎంపీ3 ప్లేయర్‌ 1020 ఎంఏహెచ్‌ బ్యాటరీ 
 20 రోజుల స్టాండ్‌ బై టైం, మైక్రో యూఎస్‌బీ పోర్టు తదితర ఫీచర్లు నోకియా 210 సొంతం. అయితే భారత్‌ మార్కెట్లలో ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: