ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్పాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తూ పోతోంది. యూజర్ల ఆసక్తిని దృష్టిలో  పెట్టుకుని కొత్త ఫీచర్లను తీసుకురాడం లేక ఉన్న ఫీచర్లను రీడిజైన్ చేయడం లాంటివి చేస్తూ ముందుకువెళుతోంది. అయితే వాట్సాప్ లో ఇప్పటి వరకు మెసేజులు షెడ్యూల్ చేసే ఆప్షన్ లేదు. ఒక వేళా అలా మెసేజ్ షెడ్యూల్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ అయిన WhatsApp Scheduler, Do It Later, SKEDit లాంటి యాప్స్ సహాయంతో షెడ్యూల్ చేయాలి. 


ఈ యాప్స్ వారి బేసిక్ వెర్షన్ లేదా ఉచిత సంస్కరణలో ఉపయోగించడానికి సులభమైనవి. అయితే, ఫోటోలు మరియు వీడియోలను పంపడం వంటి ఆధునిక లక్షణాల కోసం, వినియోగదారులు ప్రీమియం వెర్షన్‌ను కొనుగోలు చేయాలి. ఇక్కడ ఉత్తమ భాగాన్ని ఈ యాప్స్ కూడా నాన్-రూటెడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో పని చేస్తాయి. నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు వాట్సాప్ లో మెస్సేజులు ఎలా షెడ్యూల్ చేయాలో ఇక్క‌డ తెలుసుకోండి.


- గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి WhatsApp scheduler యాప్ లేదా వెబ్ సైట్ నుంచి WhatsApp scheduler.apk ఫైల్ ను డౌన్లోడ్ చేయండి.


- WhatsApp scheduler యాప్ ఇన్‌స్టాల్ అయ్యాక యాప్ బాటమ్ రైట్ లో ఉన్న ‘+' ఐకాన్ ను నొక్కండి.


- వాట్సాప్ గ్రూప్ లేదా పర్టికులర్ పర్సన్ కాంటాక్ట్ ను ఓపెన్ చేసి టైం మరియు డేట్ సెట్ చేయండి.


- ఫ్రీక్వెన్సీని ఎంచుకుని... మీ మెస్సేజ్ ను టైప్ చేయండి... షెడ్యూల్ చేయడానికి టాప్-రైట్ కార్నెర్ లో ఉన్న ‘Create' బట్టన్ నొక్కండి.


మరింత సమాచారం తెలుసుకోండి: