Vivo Z1 Pro ఈ రోజు  అమ్మకాలకు సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. Vivo Z1 Pro యొక్క మూడు వేరియంట్లను అమ్మకానికి ఉంచనుంది, ఇందులో 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి ఆన్బోర్డ్ స్టోరేజ్ వరకూ ఉన్నాయి.  వివో జెడ్ 1 ప్రో ఈ నెల ప్రారంభంలో విడుదల అయ్యింది, ఇప్పటికీ ఫ్లాష్ సేల్ మోడల్‌లో  ఉంది. హోల్-పంచ్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో సామ్‌సంగ్ గెలాక్సీ M40 మరియు షియోమి యొక్క Redmi note 7 pro వంటి వాటికి ఢీటుగా నిలిచింది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 SoC తో వచ్చిన మొదటి ఫోన్ కూడా Z1 Pro.


భారతదేశంలో Vivo Z1 Pro  ధర  బేస్ 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ ఆప్షన్ కోసం 14,990 కాగా, హై-ఎండ్ 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16.990. టాప్-ఎండ్ 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ మోడల్ కూడా ఉంది, దీని ధర రూ. 17.990. ఈ మూడు వేరియంట్లు మిర్రర్ బ్లాక్, సోనిక్ బ్లాక్ మరియు సోనిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తాయి.

 Vivo Z1 Pro అమ్మకం ఫ్లిప్‌కార్ట్ మరియు వివో ఇండియా ఇ-స్టోర్ ద్వారా జరుగుతుంది. అమ్మకం మధ్యాహ్నం 12 గంటలకు (మధ్యాహ్నం) ప్రారంభమవుతుంది. అమ్మకపు ఆఫర్లలో  జియో చందాదారుల కోసం ప్రత్యేకంగా 6,000 రూపాయలు విలువైన 40 డిస్కౌంట్ కూపన్ల రూపంలో 'మైజియో' యాప్‌లో జమ అవుతుంది. 150 చొప్పున. అదేవిధంగా, వోడాఫోన్ మరియు ఐడియా కస్టమర్లు రూ. 3,750 క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా చేసిన కొనుగోళ్లపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. ఇంకా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డ్ హోల్డర్లకు ఐదు శాతం తగ్గింపు లభిస్తుంది. ఇంట్రెస్ట్ ఫ్రీ ఈ.ఎం.ఐ  కూడా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: