అన్ని అవయవాలు సరిగ్గా వున్నవారు,తమ పనులను తాము చేసుకుంటూనే ఇతరులకు సహయం చేయవచ్చూ.కాని పూర్తిగా చూపులేని వారి పరిస్దితి దారుణం.వారికి ఈ ప్రపంచం రంగులు రంగులుగా కనబడదు,ఎవరైన చెబితే విని ఊహించుకోవడం తప్ప,అదంత ఎందుకు వారికి కనిపించే రంగు ఒక్కటే బ్లాక్ అండ్ వైట్ ఇదే వారి ప్రపంచం. అదే వారికి సమస్తం.ఇలాంటి వారికోసం ఇప్పటివరకు అందుబాటులో వున్న సదుపాయాలు చాల తక్కువని చెప్పవచ్చూ,వారికి ఏదైన అవసరం వుంటే ఇతరులను అడగడం లేదా,ఎవరైన చెబితే వినడం తప్పా స్వంతగా తెలుసుకోలేరు..ఇలాంటి వారి కోసం చైనాకు చెందిన మొబైల్ సంస్ద ఓ సరికొత్త యాప్‌ను కనిపెట్టింది.మరి ఆ యాప్ సంగతు లేంటో తెలుసుకుందామా...



అంధుల కోసం కృత్రిమమేథతో పనిచేసే పాకెట్ విజన్ అనే సరికొత్త యాప్‌ను,చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ హానర్‌  విడుదల చేసింది.ఈ యాప్‌ని ఉపయోగించి దివ్యాంగులు డాక్యుమెంట్స్,మెనూలాంటి కష్టతరమైన వాటిని సులభంగా చదవచ్చు.ప్రస్తుతం ఇది టెక్స్ట్ టూ స్పీచ్,జూం ఇన్,నెగెటివ్ ఇమేజ్ అనే మూడు మాధ్యమాల్లో లభ్యమవుతుంది. అంతేకాకుండా ఈ యాప్ ఆరు బాషలతో అందుబాటులో వుంది.అవి ఇంగ్లిష్,పోర్చుగీస్,జర్మనీ, స్పానిష్, ఇటాలియన్, చైనీస్ లాంటి భాషలను సపోర్ట్ చేస్తుంది..ఇందులో వున్న టెక్స్ట్ టూ స్పీచ్ ద్వారా చిత్రాలని టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు.



దానితో పాటు పుస్తకాలు, డాక్యుమెంట్స్,మెనూ వంటి ఇతర వాటిలో ఉండే టెక్ట్స్‌నుసులభంగా చదివి వినిపిస్తుంది.జూం ఇన్ ను ఉపయోగించి ఫోనులోని వాల్యూమ్‌ బటన్స్‌తో పదాలను పెద్దవి చేసుకోని చదివే సౌలభ్యాన్ని కల్పిస్తుంది.నెగెటివ్ ఇమేజ్ ద్వారా టెక్ట్స్‌కు కలర్ ఫిల్టర్స్‌ను జతచేయవచ్చు.విన్నారుగా ఈ ఆధునిక మొబైల్ అంధులకు ఎంతగా ఉపయోగ పడుతుందో.ఇక వారు చింతించవలసిన అవసరం లేదు..ముందు ముందు కూడా వారికోసం మరిన్ని సౌకర్యవంతమైన టెక్నాలజీ డెవలప్ అవుతుందేమో వేచి చూడాలి ఎందుకంటే వారి బాధకు కాస్తైన ఊరట లభిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: