పండగ వచ్చిందంటే చాలు అమెజాన్ ఈ కామర్స్ రంగంలో  దూసుకెళ్తుంది. నిజంగానే పండుగని కస్టమర్లు ఆస్వాదించేలా చేస్తుంది. అద్భుతమైన ఆఫర్స్ తో ఊహకందని రీతిలో అమెజాన్ ప్రవేశపెట్టి సేల్స్ మాములుగా ఉండవు. తాజాగా అమెజాన్ శామ్సంగ్ గెలాక్సీ M30  మొబైల్ పై భారీ ఆఫర్ ని ప్రకటించింది. బహుశా ఈ ఆఫర్ ఎవరూ ఊహించి ఉండరనే చెప్పాలి.

 

శామ్సంగ్ గెలాక్సీ M30  మొబైల్ ఫోన్ అసలు ధర రూ. 13.990 కాగా ప్రస్తుతం అమెజాన్ సేల్ లో ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఇస్తూ 4 వేల రూపాయలు తగ్గించింది. ప్రస్తుతం దీని ధర రూ. 9,999. దాంతో ఈ ఫోన్ పై అందరి దృష్టి పడింది. ఎన్నో ఫీచర్స్ తో ఎట్రాక్టివ్ గా ఉన్న ఈ మొబైల్ హాట్ కేక్ లా అమ్ముడు పోతోంది.

 

4 జీబీ ర్యామ్ ,64 జీబీ ఒక వేరియంట్ అయితే 4 జీబీ ర్యామ్ 128 జీబీ మరొక వేరియంట్. SD కార్డు ద్వారా 512 స్టోరేజ్ పెంచుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాదు ఈ మొబైల్ లో 3 బ్యాక్ కెమెరాలు 13MP,5MP,5MP లుగా ఉన్నాయి. ఇక సేల్ఫీ ప్రియులకోసం ఫ్రంట్ 16 MP కెమెరా అందుబాటులో ఉంది. అంతేకాదు కంటిన్యూ గా ఫోటోలని తీసుకునే సదుపాయం కూడా అందులో ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: