పేటీఎం తో మొదలు మన ఇండియా ఎక్కడికో వెళ్లిపోయింది. 2017 నోట్ల రద్దు తర్వాత ప్రతి ఒక్కరు డిజిటల్ టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయారు. కారణం గతంలో ఎవరికైన డబ్బు పంపాలంటే బ్యాంకు ఈ కార్నర్స్ లో గంటలు గంటలు నిలబడి పంపేవారు. ఇంకా నోట్ల రద్దు సమయంలో అయితే లావాదేవీలు జరపాలంటే సామాన్య ప్రజలకు చుక్కలు కనిపించేవి. 


అలాంటి సమయంలో తెరపైకి వచ్చింది పేటీఎం అని. పేటీఎంతో మొదలు గూగుల్ పే, ఫోన్ పే అంటూ వచ్చేయి. దీంతో డబ్బు పంపడం క్షణాల్లో పని. ఇంట్లో కూర్చొని ఒక రూపాయి నుండి లక్ష రూపాయిల వరుకు క్షణాల్లో డబ్బు పంపేయచ్చు. ఇలా లావాదేవీలు చెయ్యడం చాల సులభం అయిపోయింది. అయితే లావాదేవీలు ఎంత సులభం అయ్యాయో అలానే సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. 


మొన్నటికి మొన్న 95 రూపాయిలు బిరియాని ఆర్డర్ పెట్టుకొని 45 వేలు సైబర్ నేరగాళ్ల చేతిలోకి పెట్టింది ఓ యువతీ. నిన్నటికి నిన్న అతి తక్కువ ధరకు ఫ్రిడ్జ్ అమ్ముతున్నాం కావాలంటే వెంటనే 10 వేలు పంపండి అని అంటే ఆ యువతీ వెంటనే పంపింది. చివరికి మోసపోయింది. మరికొంతమంది ఫోన్లను హ్యాక్ చేసి డబ్బులను దొంగలిస్తున్నారు. 


పోలీసులు ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్త.. జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ మోసాల నుంచి తప్పించుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి అని పోలీసులు సూచిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: