రోజు రోజుకు డెవలప్ అవుతున్న టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఎన్ని వున్నాయో,ఉపద్రవాలు కూడ అన్నే వున్నాయి.ఈ టెక్నాలజీ విప్లవం అభివృద్ధి చెందిన కొద్ది మనిషి ఆలోచనలు కూడా దుర్వినియోగం వైపు మళ్లుతున్నాయి.టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం మాట అటుంచితే ఎక్కువగా దుర్వినియోగానికే పెద్ద పీట వేస్తున్నారు కొందరు కేటుగాళ్లూ. ఇప్పుడు తాజాగా వచ్చిన మరో కొత్త వాట్సప్ ఫీచర్ వల్ల ఎన్నిలాభాలున్నాయో అంతే నష్టాలున్నాయని అంటున్నారు. అవేంటో చూద్దాం..



మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి త్వరలో మరో అద్భుతమైన ఫీచర్ రాబోతోంది.ఈ ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే ఇక సున్నితమైన మెసేజ్‌లను పంపే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంత సమయం తర్వాత వాటంతట అవే డిలీట్ అయిపోతాయి.ఇందుకోసం‘సెల్ఫ్ డిస్ట్రక్టింగ్’మెసేజ్ ఫీచర్‌ను తీసుకొస్తోంది.‘బగ్ ఫ్రీ’గా రాబోతున్న ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉందట.ఇక ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ వర్షెన్ 2.19.275లో  డౌన్‌లోడ్ చేసుకుని ఆ తర్వాత ఇన్స్‌టాల్ చేసుకోవాల్సి ఉంటుంది..ఇది పూర్తి స్థాయిలో డెవలప్ అయితన తర్వాత అంతర్గతంగా టెస్ట్ చేసి కొంత పరిమితమందికి మాత్రమే ఈ బీటా వర్షన్ విడుదల చేస్తారు.కొన్ని రోజుల ప్రయోగం తర్వాత ఏమైనా బగ్స్ వస్తే వాటిని పరిష్కరించిన తర్వాతే మొత్తం వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.



ఇది ఆండ్రాయిడ్ వర్షెన్‌లో సక్సెస్ అయితే ఐఓఎస్ వర్షెన్‌ కూడా డెవలప్ చేస్తామని వాట్సాప్ తెలిపింది.ఇక ఏదైనా మెసేజ్‌ను పంపించాక, అది ఎక్కువ సేపు ఉండకూడదని భావిస్తే..డిజప్పియర్డ్‌ మెసేజెస్‌ లోకి వెళ్లి, ఆఫ్‌, 5 సెకండ్స్‌, గంట అనే అప్షన్‌ను ఎంచుకోవాలి. ఒక్కసారి డిలీట్‌ అయిన తరువాత ఇవి చాట్‌లో ట్రాక్‌లో కూడా అందుబాటులో ఉండవు.అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉండగా..త్వరలోనే వాట్సాప్ యూజర్లందరికి అందుబాటులోకి తేనుంది. ఇటీవల వాట్సాప్‌ స్టేటస్‌ స్టోరీలను డైరెక్టుగా ఫేస్‌బుక్‌ స్టోరీలో షేర్‌ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.



అయితే తాజా అప్‌డేట్‌పై  వాట్సాప్‌ అధికారికంగా  ప్రకటన చేయాల్సి వుంది.ఇక భారత్‌లో డిస్సప్పీయరింగ్ మెసేజ్" ఫీచర్ పనికిరాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే భారత్‌లో చాలా ఫేక్ మెసేజ్‌లు వాట్సాప్ ద్వారా వైరల్ అవుతున్నాయి.అయితే కొన్ని మెసేజ్‌ల ద్వారా ఏదైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే మెసేజ్ ఎక్కడి నుంచి సర్క్యులేట్ అయ్యిందో తెలుసుకుని,మెసేజ్ సర్క్యులేట్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసే వీలు సైబర్ పోలీసులకు ఉండదు. అందుకే ఇది చాల ప్రమాదకరమైన ఫీచర్‌గా,ఇలాంటి ఫీచర్స్ అసాంఘీక శక్తుల చేతిలో పడితే చాల ప్రమాదకరం అని పేర్కొంటున్నారు....

మరింత సమాచారం తెలుసుకోండి: