మన దేశ సంస్కృతి సంప్రదాయాలను దెబ్బ తీసేలా.. యువతను పెడత్రోవ పట్టించేలా ఉన్న పోర్న్ సైట్లను నియంత్రించాలని కేంద్రం ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇందుకు కొన్ని చర్యలు కూడా తీసుకుంది. కానీ అవేమీ అంతగా ఫలితాలు ఇస్తున్నట్టు లేదు.. ఆ పోర్న్ సైట్లు మళ్లీ వచ్చేస్తున్నాయి


ఎంత ప్రయత్నించినా .. దేశంలో పోర్న్ సైట్లను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోతోంది. ఎన్ని చట్టాలు చేసినా, నిషేధాజ్ఞలు వేసినా.. అవి మళ్లీ వస్తూనే ఉన్నాయి. ఉత్తరాఖండ్ హైకోర్టు గతేడాది సెప్టెంబర్ 27న పోర్న్ సైట్లపై నిషేధం విధించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వంకూడా దాదాపుగా వెయ్యి సైట్లను నిషేధించింది.


అయితే ఇక్కడే ఆ పోర్న్ సైట్ల నిర్వహాకులు తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు. ఒకసారి నిషేధం విధించిన తర్వాత అవే వెబ్ సైట్లు తమ డొమైన్ పేర్లను మార్చి మళ్లీ భారత్ లోకిప్రవేశిస్తున్నాయి. అంతకు ముందు ఉన్న .com స్థానంలో .org, .net పేర్లలో మళ్లీ పుట్టుకొస్తున్నాయి. విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: