మన నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో వాట్సాప్ ఒకటి. వాట్సాప్ ప్రతి అప్ డేట్ ద్వారా వినియోగదారులకు మరింత చేరువ అవుతోంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న వాట్సాప్ మరికొన్ని అద్భుతమైన ఫీచర్లను అందించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ అతి త్వరలో వినియోగదారులకు డార్క్ మోడ్ మరియు డిజప్పియరింగ్‌ మెసేజెస్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతుంది. 
 
కొన్ని నెలల క్రితమే వాట్సాప్ డార్క్ మోడ్ తీసుకురాబోతుందని వార్తలు వినిపించాయి. కానీ ఆ తరువాత డార్క్ మోడ్ గురించి ఎటువంటి వార్తలు వినిపించలేదు. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం మేరకు వాట్సాప్ త్వరలోనే డార్క్ మోడ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. మొదట ఈ ఫీచర్లు వాట్సాప్ బీటా 2.19.282 వెర్షన్ ఉపయోగించే వారికి అందుబాటులోకి వస్తాయి. ఆ తరువాత సాధారణ యూజర్లకు కూడా ఈ ఫీచర్లు అందుబాటులోకి రాబోతున్నాయని తెలుస్తోంది. 
 
మనం మొబైల్లో ఉపయోగించే నార్మల్ మోడ్ వలన మొబైల్ నుండి వచ్చే కాంతి కంటిపై ప్రభావం చూపటంతో పాటు ఫోన్ ఛార్జింగ్ కూడా తక్కువ సమయం వస్తుంది. అలా కాకుండా డార్క్ మోడ్ ఉపయోగిస్తే బ్యాక్ గ్రౌండ్ నల్లగా మారిపోవటంతో మన కంటికి కాంతి ప్రభావం తగ్గుతుంది. ఫోన్ చార్జింగ్ కూడా ఎక్కువ సమయం వస్తుంది. వాట్సాప్ తీసుకొచ్చిన డిజప్పియరింగ్‌ మెసేజెస్ ఫీచర్ ద్వారా మెసేజ్ నిర్ణీత సమయం తరువాత డిలేట్ అయిపోతుంది. 
 
భవిష్యత్తులో వాట్సాప్ లో ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లు కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. డార్క్ మోడ్, డిజప్పియరింగ్‌ మెసేజెస్ అనే ఆప్షన్లను త్వరలోనే వాట్సాప్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. వాట్సాప్ ఎప్పుడు ఈ ఫీచర్లను తీసుకొస్తుంది అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: