సాంకేతిక విప్లవంతో వచ్చిన పరిణామాల నేపధ్యంలో ఎన్నో పరిశోధనాత్మకమైన ప్రయోగాలు జరిగాయి..ఇంకా జరుగుతున్నాయి. ఇప్పటికే జనజీవన స్రవంతిలో డిజిటలైజేషన్ దే పైచేయిగా ఉంది. ఇప్పటికే చాల వరకు గూగుల్ పై ఆధారపడిపోనా పరిస్థితులు నెలకొన్నాయి.  అంతేందుకు చేతిలో సెల్ ఫోన్ లేనిదే నిత్యా జీవితంలో పూట గడవడం గగనమైపోయింది. ఏది కావాలన్నా ఫోన్ చేతిలో ఉంటె క్షణాల్లో కోరినవి మన ముందుకు వస్తున్నాయి. భవిష్యత్ అంతా డిజిటలైజేషన్ మయమే మరి. అలంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని ఏ గ్రంధ్రానైనా మనం ఉన్నచోటే చదువుకోవచ్చు. కంప్యూటర్ లేదంటే స్మార్ట్‌ఫోన్ ఏదీ వీలయితే దానిని వినియోగించుకుని సేవలు పొందవచ్చు. కంప్యూటర్‌లేని వారు ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లతో అరచేతిలోనే పుస్తకాలను చదువుకోవచ్చు. అది కూడా రూపాయి ఖర్చుచేయకుండా కావాల్సిన పుస్తకాలను చదువుకోవచ్చు.  ఈ అవకాశాన్ని కల్పిస్తున్న డిజిటల్ గ్రంథాలయ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..
అందుకు మీరు చేయాల్సిందల్లా..గూగుల్‌లో ndliitkgp. ac.inలో లాగిన్ అయితే చాలు.  ఇక స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు యాప్‌స్టోర్ నుంచి నేషనల్ డిజిటల్ లైబ్రరీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. కోరుకున్న పుస్తకం దొరకాలంటే.. వందషాపుల, పదుల కొద్ది గ్రంథాలయాలను చుట్టేయాల్సిన ఈ తరుణంలో, రూపాయి ఖర్చుచేయకుండా,అరచేతిలోనే పుస్తకాలను చదుకోవడం, డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించడం గమనార్హం. సాంకేతిక విప్లవం పుణ్యమాని డిజిటలైజేషన్ వైపు అడుగులేస్తున్నాయి. పాఠకుల అరచేతిలో కావాల్సిన పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నాయి.
 
కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ, ఖరగ్‌పూర్ ఐఐటీలు సంయుక్తంగా ఈ  డిజిటల్ గ్రంథాలయాన్నిఅందుబాటులోకి తీసుకొచ్చాయి. వృద్ధులు, పిల్లలు, యువత అభిరుచుల మేరకు పుస్తకాలను అందుబాటులో ఉంచారు.  పోటీ పరీక్షల ఆశావాహులు, పుస్తక ప్రియులను ఆకట్టుకునేందుకు ఇలాంటి ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇందులో  కంప్యూటర్ సైన్స్, సమాచారం, వ్యవసాయం, జనరల్‌వర్క్, గణితం, మతం, సాహిత్యం, భాష, కళలు, పైన్ ఆర్ట్స్, డెకోరేటివ్ ఆర్ట్స్, చరిత్ర, భూగోళశాస్త్రం, నేచురల్ సైన్స్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషల్‌సైన్స్ లాంటి అనేక అంశాలకు సంబంధించిన పుస్తకాలను వినియోగంలోకి తీసుకొచ్చారు.38 లక్షల మంది ఈ గ్రంథాలయ సేవలను వినియోగించుకుంటున్నారు. 
అప్పటికి.. ఇప్పటికి గ్రంథాలయాల పట్ల మక్కువ తగ్గకపోవడం విశేషం. ఆధునిక కాలంలోనూ విద్యార్థులు.. నిరుద్యోగులు.. పోటీపరీక్షల కోసం సిద్ధమవుతున్న ఆశావాహులు గ్రంథాలయాలనే ఎంచుకుంటున్నారు. పాఠకుల అభిరుచులకు తగినట్లుగా గ్రంథాలయాలు సైతం మార్పునకు గురవుతున్నాయి. గ్రంథాలు, పుస్తకాలు. దినపత్రికలను అందుబాటులో ఉంచుతూ పాఠకుల మన్ననలను పొందుతున్నాయి. వృద్ధులు.. పిల్లలు.. యువత అన్నతేడా లేకుం డా అందరూ గ్రంథాలయాలను వినియోగించుకుంటున్నారు. కాగా వర్తమాన కాలానికి అనుగుణంగా డిజిటల్ రూపును సంతరించుకుంటున్నాయి. దేశంలోనే అతిపెద్ద డిజిటల్ లైబ్రరీ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: