ప్రపంచమంతా స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తూ... ఫోన్‌లో పదుల సంఖ్యలో యాప్స్ ఇన్‌స్టాల్ చేసి, గంటలు గంటలు వాటితో గడుపుతూ సమయాన్ని వృథా, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అందుకే గూగుల్ యూజర్ల శ్రేయస్సు కోసం ఆండ్రాయిడ్‌లో డిజిటల్ వెల్‌బీయింగ్‌ ఫీచర్‌ని పరిచయం చేసింది.  ఏ యాప్ ఎంతసేపు వాడుతున్నారు? టైమ్ లిమిట్ ఎలా సెట్ చేసుకోవాలి? అనే ఆప్షన్లు తీసుకొచ్చింది గూగుల్.


ఇప్పుడు డిజిటల్ వెల్‌బీయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని 5 కొత్త యాప్స్ రూపొందించింది గూగుల్. ఆ యాప్స్ మీ స్క్రీన్ టైమ్‌ని తగ్గించేవే. మరి ఆ యాప్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి. అన్ లాక్ క్లాక్:  మీరు ఒక రోజులో ఎన్నిసార్లు ఫోన్‌ను అన్‌లాక్ చేశారో లెక్కించి చూపిస్తుంది ఈ యాప్. ఇందుకోసం మీరు వాల్‌పేపర్ డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించడమే. పోస్ట్ బాక్స్: ఏకాగ్రత పని చేసుకుంటున్నప్పుటు వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్స్ చికాకుపుట్టిస్తుంటాయి. ఇలాంటి సమస్యకు పోస్ట్ బాక్స్ యాప్‌తో చెక్ పెడుతోంది గూగుల్. మీరు  ఏ సమయాల్లో నోటిఫికేషన్స్ పొందాలో సెలెక్ట్ చేయొచ్చు. పోస్ట్ బాక్స్ యాప్ ద్వారా ఆ నోటిఫికేషన్లన్నీ మేనేజ్ చేయొచ్చు.


'వి ఫ్లిప్' : స్నేహితులంతా కలిసి ఎక్కడికైనా వెళ్తే అందరూ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించకుండా సమయాన్ని గడిపేందుకు ఉపయోగపడే యాప్ 'వి ఫ్లిప్'. ఈ యాప్‌ను అందరూ డౌన్‌లోడ్ చేసుకొని ఫోన్ లాక్ చేయాలి. గ్రూప్‌లో ఏ ఒక్కరు ఫోన్ అన్‌లాక్ చేసినా తెలిసిపోతుంది. 
డిసర్ట్ ఐల్యాండ్ :ఎక్కడికైనా టూర్ వెళ్లినప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో మునిగిపోకుండా అవసరమైన యాప్స్ మాత్రమే ఉపయోగించడానికి డిసర్ట్ ఐల్యాండ్ యాప్ ఉపయోగపడుతుంది. ఆ రోజు మీరు ఏ యాప్స్ అవసరమో వాటిని సెలెక్ట్ చేసుకొని అవి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. మిగతా యాప్స్ కనిపించవు. 


మార్ఫ్ : ఏ యాప్‌ను ఎంత సేపు ఉపయోగించాలో మీరే సమయాన్ని కేటాయించడానికి ఉపయోగపడుతుంది మార్ఫ్ యాప్. మీరున్న స్థలం, సమయాన్ని బట్టి ఆ యాప్స్ పనిచేస్తాయి. ఉదాహరణకు ఇంట్లో ఉన్నప్పుడు ఉపయోగించే యాప్స్, ఆఫీసులో వాడే యాప్స్ ఇలా వేర్వేరుగా డివైడ్ చేయొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: