చైనా
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ మరో కొత్త
ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. హానర్ 20 సిరీస్ లో భాగంగా హానర్ 20 లైట్ ను హానర్ సంస్ద నిన్న చైనా మార్కెట్ లో విడుదల చేసింది. అయితే ఈ
ఫోన్ మరి కొన్ని నెలల్లో
భారత్ సహా పలు ఇతర అంతర్జాతీయ మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది.
అయితే ఈ
ఫోన్ కు సంబంధించి ప్రీ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఈ
ఫోన్ అమ్మకాలు మాత్రం రేపు (అక్టోబర్ 25) నుంచి అమ్మకాలు ప్రారంభమవ్వనున్నాయి. వాటర్ డ్రాప్ నాచ్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్, రియర్ ట్రిపుల్ కెమెరా, సూపర్ నైట్ సీన్ మోడ్, ఏఐ సీన్ రికగ్నిషన్, పొర్ ట్రెయిట్ మోడ్ లాంటి ప్రధాన ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి.
అద్భుతమైన ఫీచర్లు ఇవే...
6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే,
2400 × 1080 రిజల్యూషన్,
కిరిన్ 710F ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 9 పై ఈఎంయూఐ 9.1.1,
16 ఎంపీ సెల్పీ కెమెరా,
48 +8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్,
4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ
ఫోన్ లో ఉండనున్నాయి.
ఫోన్ ధరలు కూడా 4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.14 వేలు, 6 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.15 వేలు, 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.17 వేలు, టాప్ ఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ రూ.19 వేలు ఉండనున్నాయి. అయితే ఈ
ఫోన్ మరికొద్ది నెలల్లో
భారత్ కు రానుంది.